జూనియర్ ఎన్టీయార్. టాలీవుడ్ టాప్ హీరో. ఎంతో ఫ్యూచర్ ఉన్న స్టార్. నందమూరి వంశాన్ని మూడవ తరానికి తీసుకెళ్ళిన యంగ్ తరంగ్. ఇక సీనియర్  ఎన్టీయార్ 1948న సినీ సీమలో అడుగుపెడితే ఇప్పటివరకూ అప్రతిహతంగా అంటే 72 ఏళ్ళుగా టాలీవుడ్లో నందమూరి జెండా అలా విజయవంతంగా ఎగురుతోంది. దానికి వారసులు ఎంతో కారణం.

 

ఇప్పటితరానికి  నందమూరి వంశాన్ని కనెక్ట్ చేసిన జూనియర్ తన టాలెంట్ తో మరో మూడు దశాబ్దాల పాటు  ఇండస్ట్రీలో కొనసాగేలా బలమైన పునాది వేసుకున్నాడు. ఇక జూనియర్ కి ఒక్క సినీ బంధమే లేదు. రాజకీయ అనుబంధం కూడా ఉంది. ఆయన తాత ఎన్టీయర్ స్థాపించిన పార్టీ టీడీపీ వయసు ఇపుడు 38 ఏళ్ళు. జూనియర్ కంటే ఒక ఏడాది ముందు పుట్టిన టీడీపీ వైభోగం గత వైభవంగా మారింది.

 

దానికి చరిష్మాటిక్ లీడర్ కావాలి. చంద్రబాబు తన రాజకీయ చాతుర్యంతో ఎన్టీయార్ మరణించాక ఇంతకాలం పార్టీని నడుపుకుని వచ్చారు. ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్న ఎపుడూ ఉండనే ఉంది. లోకేష్ వారసత్వం పట్ల పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకే జూనియర్ మీద టీడీపీ చూపు పడింది.

 

జూనియర్ బర్త్ డే వేళ ఆయనకు వెల్లువలా గ్రీటింగ్స్ వచ్చాయి. అందులో టీడీపీ నుంచి వచ్చినవి ఎక్కువ కావడం విశేషం. టీడీపీ నుంచి బావ నారా లోకేష్ నుంచి మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎంపీలు పోలోమంటూ జూనియర్ కి గ్రీట్ చేశారు. మరి ఇది దేనికి సంకేతమన్న చర్చ సాగుతోంది.

 

గత ఏడాది ఇదే వేళకు ఇదే రోజున జూనియర్ బర్త్ డే జరిగింది కానీ ఇంత హడావుడి లేదు. జూనియర్ బర్త్ డేను కూడా నాడు తమ్ముళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు  వస్తాయి. తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉన్నారు. మొత్తానికి చూస్తే ఈసారికి సీన్ మొత్తం అర్ధమైంది.

 

అందుకే జూనియర్ కోసం టీడీపీ నేతలు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని అంటున్నారు. మరి జూనియర్ తెలుగుదేశం పిలుపు వింటాడా. చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: