ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో జీవులు అంతరించి పోయాయి. అయితే ప్రస్తుతం కాలాంలో భయంకరమైన కాలుష్యం.. పశు పక్ష్యాదులను వేటాడి చంపడం వల్ల కొన్ని జీవులు పూర్తిగా అంతరించి పోతున్నాయి. అలాంటి వాటిని మ్యూజియంలోనే చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.  ప్రస్తుతం కొన్ని పక్షి జాతులు అంతరించి పోతున్నాయి.. కారణం సెల్ ఫోన్లు ఎక్కువ వాడటం వల్ల వాటి నుంచి వచ్చే విద్యుత్ తరంగాలు కొన్ని పక్షులను పూర్తిగా నాశనం చేస్తున్నాయని పక్షి ప్రేమికులు అంటున్నారు.  అలాగే కొన్ని జంతువులను అదే పనిగా వేటాడటం వల్ల అవి పూర్తిగా అంతరించిపోతున్నాయని అంటున్నారు జంతు ప్రేమికులు.  తాజాగా ఓ జీవి పూర్తిగా అంతరించిపోయింది.. 1935లో చివరిసారిగా ఆ జాతికి చెందిన చివరి ప్రాణిని ఫిల్మ్ తీశారు.

 

తవ్వకాల్లో బయటపడ్డ ఆ ఫిల్మును 4కే వీడియో రూపంలో విడుదల చేస్తే నెటిజనులు ఎంతో కుతూహలంగా చూస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆ ప్రాణికి థైలాసీన్ అని పేరు. వీపు మీద పులి చారల్లాంటివి ఉండడం వల్ల టాస్మేనియన్ టైగర్‌గా పాపులర్ అయింది. నిజానికి ఇది ఎలుకజాతికి చెందిన ప్రాణి. బ్యూమారిస్ జూలో 1935లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్ములో బెంజమిన్ అనే పేరుగల చివరి థైలాసీన్ కదలికలు చిత్రీకరించారు.

 

ఆ వాయిస్ ఓవర్‌లో 'ఇది (థైలాసీన్) చాలా అరుదైన ప్రాణి.. నాగరికత విస్తరణతో ఇది తన గూడును కోల్పోయింది' అనే మాటలు వినిపిస్తాయి.  అయితే ఈ ఫిలిమ్ తీసిన 18 మాసాల తర్వాత బెంజమిన్ 1936 సెప్టెంబర్ 7న కన్నుమూసింది. ఆ తర్వాత ఈ జీవి మళ్లీ కనిపించలేదు. మొత్తం 21 సెకన్ల వీడియోను ఆస్ట్రేలియా నేషనల్ ఫిల్మ్ అండ్ సౌండ్ ఆర్కైవ్స్ ట్విట్టర్‌లో విడుదల చేసింది. దీనికి 86 వేల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: