ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో వైరస్ లు వచ్చాయి.. వాటి వల్ల నష్టాలు కూడా వచ్చాయి. అయితే కొన్నింటిని వెంటనే జయించి వైరస్ కి యాంటీ డోస్ కనిపెట్టారు.  కానీ ఇప్పటి వరకు కరోనాకి ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేకపోతున్నారు.  దాంతో చిన్నా..పెద్ద దేశాల్లో కరోనా కేసులు పెరగడమే కాదు.. మరణాల సంఖ్య కూడా కలత చెందిస్తుంది.  అమెరికా లాంటి అగ్ర రాజ్యం ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతుంది.  అమెరికా, ఇటలీ,ఫ్రాన్స్, బ్రిటన్ తో పాటు ఇప్పుడు రష్యాలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది.  కరోనా వల్ల ఆర్థిక నష్టమే కాదు.. కోట్ల మంది మానసికంగా కృంగిపోతున్నారు. ఇలాగే కొంత కాలం కరోనా మరణాలు, కేసులు పెరిగిపోతే ఆకలి చావులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.  

 

అయితే మనుషుల సంగతి అలా ఉంటే ఇప్పుడు పశు పక్షాదులు కూడా కరోనా ప్రభావంతో అల్లకల్లోలం అవుతున్నాయి.  ఆకలితో అలమటించి పోతున్నాయి.. దాంతో అడవుల్లో ఉన్న కృర జంతువులు జనలు ఆవాసం ఉండే చోటకు వస్తున్నాయి.  ఇక కరోనా వల్ల కుక్కలు తీవ్రమైన ప్రభావానికి లోనవుతున్నాయని అంటున్నారు.  జనం రోడ్లపై తిరుగుతున్నప్పుడు వాళ్లు పారేసిన తిండిని, హోటళ్లు పారేసిన ఆహారాన్ని తిని బతికిన కుక్కలు రెండు నెలలుగా ఆకలితో అల్లాడుతున్నాయి. పిచ్చితో దాడులకు కూడా దిగుతున్నాయి.

 

తాజాగా కాన్పూర్‌లో వీధికుక్కలు మానసిక వికలాంగురాలిపై దాడి చేసి చంపేశాయి.  ఈ దారుణమైన సంఘటన  కాకాదేవ్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.  విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.  ఆమె వివరాలేవీ తెలియరాలేదని అన్నారు.  లాక్‌డౌన్‌లో వల్ల ఆ ప్రాంతంలోని కుక్కలు తిండి దొరక్క కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతున్నాయని చెప్పారు. కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని, లేకపోతే చంపేయాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే కుక్కలు ఉన్న చోట వాటికి ఆహారం అందించాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: