యేడాది పాల‌న‌లో ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో యావ‌త్ భార‌త దేశ రాజ‌కీయ‌, మీడియా మేథావుల‌ను త‌న వైపున‌కు తిప్పుకుంటోన్న జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు గుడ్ న్యూస్‌లు చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి పేద వాడి సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్నారు. వాస్త‌వంగా చూస్తే నాటి ఉమ్మ‌డి ఏపీలో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు నిర్మించిన ఇళ్లు మిన‌హా ఆ త‌ర్వాత ఇళ్ల నిర్మాణం అనేదే పేద‌ల‌కు లేకుండా పోయింది. కిర‌ణ్ కుమార్ రెడ్డి, రోశ‌య్య సీఎంలుగా ఉన్న‌ప్పుడు గృహ నిర్మాణ శాఖ‌కు కేటాయించిన నిధులు కాని.. ఆ టైంలో క‌ట్టిన ఇళ్ల గురించి కాని మాట్లాడుకోవ‌డం టైం వేస్ట్‌.

 

ఇక చంద్ర‌బాబు ఐదేళ్లు సీఎంగా ఉన్న‌ప్పుడు అస‌లు గృహ నిర్మాణం అన్న ఒక శాఖ ఉన్న‌ట్టే మ‌ర్చిపోయిన‌ట్టు న్నారు. చంద్ర‌బాబు ఎంత వ‌ర‌కు అమ‌రావ‌తి.. ఆంధ్రుల రాజ‌ధాని.. మ‌న క‌ల‌ల రాజ‌ధాని అన్న ప్ర‌చార‌మే చేశారు. ఇక పోల‌వ‌రం ప్రాజెక్టు అంటూ.. ప‌ట్టిసీమ అంటూ హ‌డావిడి చేశారే త‌ప్పా చంద్ర‌బాబు పేద‌ల‌కు సొంతింటి క‌ల నెరేవ‌ర్చాల‌న్న ఆశాయ‌నికి పూర్తిగా తూట్లు పొడిచేశారు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయ్యాక ఏపీలో ఉన్న అన్ని గ్రామాల్లో పేద‌ల‌కు సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చాల‌న్న సంక‌ల్పంతో ముందుకు వెళుతున్నారు. ఏపీలో సొంతిల్లు లేని పేద‌వాళ్లు అంటూ ఎవ్వ‌రూ ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న ఇప్ప‌టి కే ప‌దే ప‌దే చెపుతూ వ‌స్తున్నారు. 

 

ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ భూములు.. రైతు పోరంబోకులు.. ఊరి చివ‌ర ప్ర‌భుత్వ భూములు ఎక్క‌డ ఉన్నా జ‌ల్లెడ ప‌ట్టేస్తున్నారు. వీటిని ఇప్ప‌టికే ఎక్క‌డిక‌క్క‌డ చ‌దును చేసే ప్ర‌క్ర‌య కూడా న‌డుస్తోంది. ఈ నెల 31వ తేదీ లోగా భూసేక‌ర‌ణ పూర్తి చేసి... ప్లాట్లు వేసి రెడీగా ఉంచుతారు. ఇక ఇళ్ల పట్టాలకు సంబంధించి తుది జాబితా జూన్‌ 7న ప్రకటిస్తారు. ఇళ్ల పట్టాల కోసం రూ.4,436.47 కోట్లు విడుదల చేశారు. జ‌గ‌న్ వేసిన ఈ బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌ను ఇప్పుడు క‌ర్నాట‌క కూడా ఫాలో అవ్వాల‌ని చూస్తోంది. ఇదే ఆలోచ‌న రేపు దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల‌కు ఆద‌ర్శం అయ్యే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: