దేశవ్యాప్తంగా మొన్నటి దాకా అనేక అవస్థలు పడిన వలస కూలీల కు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకుని వారిని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ప్రతీ రాష్ట్రంలో వలస కూలీల కు ఆహారం మరియు మరికొన్ని సదుపాయాలు కల్పిస్తూ శ్రామిక రైలు ద్వారా వారి చేరుకోవలసిన గమ్యస్థానాలకు వారిని చేరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియాలో కరోనా వైరస్ ఉన్న కొద్దీ విస్తరిస్తున్న తరుణంలో వలస కూలీలు సొంత ఊరికి వస్తుంటే, ఊరిలో ఉన్న వారు వణికిపోతున్నారు. ఎవరు ఎక్కడ కరోనా వైరస్ అంటించుకుని వచ్చేరో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వలస కూలీల సంఖ్య భారీగా పెరిగింది. 50 మందికి పైగా వలస కూలీల కు వైరస్ వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

 

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన చాలామంది వలస కూలీలు సొంత ఊరికి చేరుకుంటున్నారు. అందులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సు జిల్లాకు చెందిన 50 మంది వలస కూలీల కు వైరస్ దొరికినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కరోనా వైరస్ బారిన పడిన వలస కూలీల సంఖ్య వందకు పైగా చేరుకుంది. 24 మంది కోలుకునే డిశ్చార్జ్ అవ్వగా మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఇక భాధితులందరు ఇటీవల మహారాష్ట్ర నుంచి బస్తీకి చేరుకున్న వలస కూలీలని జిల్లా కలెక్టర్ అశుతోష్ నిరంజన్ తెలియచేసారు.

 

వారందని కంటాక్స్ట్ ట్రేసింగ్ చేస్తున్నామని ఆరోగ్యశాఖ తెలియచేసింది. ఇక యూపీలో ఇప్పటివరకు కరోనా భారిన పడిన వారి సంఖ్య 4926 కి చేరుకోగా, వీరిలో 2918 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 123 మంది మృతి చెందగా, 1885 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద ఈ వార్తలు విని వలస కూలీలు తమ ఊరు లోకి వస్తున్నారని చాలామంది వైరస్ సోకుతుంది ఏమో అని తెగ భయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: