దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్ష దాటగా కరోనా మృతుల సంఖ్య 3,000 దాటింది. కేంద్రప్రభుత్వం ఇండియాలోనే సొంతంగా వస్తువులను తయారు చేసి మన దేశంలోనే వినియోగించుకోవడానికి మేక్ ఇన్ ఇండియాను తీసుకొచ్చింది. మేక్ ఇన్ ఇండియా కోసం కేంద్రం నిధులు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. 
 
కరోనా విజృంభణ అనంతరం గో లోకల్ నినాదంతో కేంద్రం పీపీఈ కిట్లను తయారు చేస్తోంది. రెండు నెలల క్రితం పీపీఈ కిట్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన ఇండియా ప్రస్తుతం రోజుకు నాలుగున్నర లక్షల పీపీఈ కిట్లను తయారు చేసే స్థాయికి ఎదిగింది. ఇతర దేశాలకు కిట్లను, మాస్క్ లను ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది. కరోనా సంక్షోభం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా మనలోని నైపుణ్యం మనకు తెలిసి వచ్చింది. 
 
ప్రస్తుతం ఇతర దేశాలు సైతం భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో హైడ్రాక్సీ క్లిరోక్విన్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన భారత్ పీపీఈ కిట్ల ఎగుమతితో భారత్ మరో మెట్టు ఎదిగింది. దాదాపు 200 కంపెనీలు దేశంలో హైడ్రాక్సీ క్లిరోక్విన్ ను తయారు చేస్తున్నాయి. రెండు నెలల క్రితం ఒక్క పీపీఈ కిట్ కూడా ఉత్పత్తి చేయలేని స్థాయిలో ఉన్న భారత్ ఏడు 4.5 లక్షల కిట్లు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగటం సాధారణ విషయం కాదు. 
 
చైనా నుండి, దక్షిణ కొరియా నుండి దిగుమతులు చేసుకున్న భారత్ లో ప్రస్తుతం 600 కంపెనీలు పీపీఈ కిట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ల్యాబ్ సర్టిఫైడ్ కంపెనీలే ఈ కిట్లను పంపిణీ చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు భారత్ మందులు, వైద్య సామాగ్రితో పాటు పీపీఈ కిట్లను విక్రయిస్తోంది. కేంద్రం దేశానికి కొత్త ఉపాధి అవకాశాలు తీసుకురావడంలో, దేశానికి కొత్త రకమైన మంచి జరిగేలా చేయడంలో కేంద్రం సక్సెస్ అయిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: