ఇటీవల వైయస్ జగన్ ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుండి లీక్ అయినా గ్యాస్ విషయంలో ప్రమాదానికి గురైన బాధితులతో పరామర్శించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి అసలు అనుమతులు ఏ ప్రభుత్వం ఇచ్చింది అన్న దాని గురించి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1996వ సంవత్సరంలో చంద్రబాబు ఆధ్వర్యంలో అనుమతులు వచ్చాయని, విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో 2015 సంవత్సరంలో ఎల్జి పాలిమర్స్ కంపెనీకి మళ్ళి అనుమతులు పెంచినట్లు, ఆ కంపెనీ చంద్రబాబు టైంలో లబ్ధి పొందినట్లు జగన్ సంచలన ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి చంద్రబాబు తాజాగా స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

జగన్ ముఖ్యమంత్రి అవకముందు వరకూ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి లాగా వ్యవహరించారని, అయితే అధికారంలోకి వచ్చాక తన తాత రాజారెడ్డి లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరి మీద పడితే వారి మీద అక్రమ కేసులు అధికారంలోకి వచ్చి పెడుతున్నారని, కక్షసాధింపు చర్యగా పరిపాలిస్తున్నారు అని జగన్ మీద చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విషయంలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అన్ని అబద్ధాలు అని అన్నారు. వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఎవరి మీద పడితే వారి మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

 

అయితే ఈ సందర్భంలో రాజారెడ్డి పేరు చంద్రబాబు ప్రస్తావన తీసుకు రావటం తో చంద్రబాబు పై విమర్శలు వస్తున్నాయి. జగన్ తాత రాజారెడ్డి మీ హయాంలోనే, టీడీపీ లో పెద్ద పెద్ద తలకాయలు ఆయనని చంపారు. అప్పుడు మాట్లాడని నోరు ఇప్పుడు రాజారెడ్డి గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ అభిమానులు నిజంగా జగన్ తన తాత రాజారెడ్డి లాగా వ్యవహరిస్తే నువ్వు పర్మినెంట్ గా తెలంగాణలో ఉండిపోవాల్సి వస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: