క‌రోనా మ‌హ‌మ్మారి పుట్టుకకు కార‌ణ‌మ‌ని ప్ర‌పంచంచే ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న చైనాకు మ‌రో షాక్ త‌గిలింది. వైరస్ పుట్టుక ప్రారంభమైన అనంత‌రం కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్న చైనాకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. లాక్ డౌన్ అనంతరం గత రెండు మూడు వారాల్లో 46 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ద‌ఫా వుహాన్‌లో కాకుండా దేశంలో ఈశాన్య ప్రాంతంలో కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ రోగ ల‌క్ష‌ణాలు భిన్నంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.


షులాన్, జిలిన్ నగరం మరియు షెంగ్యాంగ్ లో చైనా ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసింది. ఈ మూడు ప్రాంతాల్లో సుమారు 100 మిలియన్ల జనాభా ఉన్నారు. చైనాలోని ఉత్తర ప్రావిన్స్ ప్రాంతాలైన జిలిన్ మరియు హీలాంగ్జియాంగ్ ప్రజలకు సోకిన వైరస్ ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతోంది. హుబే ప్రావిన్సుకంటే ఈశాన్య ప్రాంతాల్లో నమోదైన కరోనా 68,000పైగా సోకడంతో డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి విజయవంతం అవ్వడం లేదని చైనాలోని ప్ర‌ముఖ అత్య‌వ‌స‌ర సేవ‌ల వైద్యుల్లో ఒకరైన క్యూ హైబో మీడియాకు వెల్లడించారు. వుహాన్ లో సోకిన వైరస్ కంటే ఈశాన్యం ప్రాంతంలో సోకిన వైరస్ రెండు వారాలు కంటే ఎక్కువగా ఉందని, వ్యాప్తి చెందకుండా రక్షణ చర్యలు తీసుకోవడం కష్టంగా ఉందని క్యూ హైబో అన్నారు. 

 

 హుబే ప్రావిన్స్‌కి, ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలకు సోకిన వైరస్‌కు ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకునే  ప్రయత్నం చేశామని  డాక్టర్ క్యూహైబో సూచించారు.  వైరస్ సోకి బాధితుల సంఖ్య పెరుగుతోందని.. అరికట్టే మార్గల్ని అన్వేషిస్తున్నామన్నారు. కాగా, ఈ కొత్త వ్యాధితో చైనాలో క‌ల‌వ‌రం మొద‌లైంది.  మ‌రోవైపు చైనాలో మొద‌లైన ఈ వైర‌స్ తిరిగి ప్ర‌పంచాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తుందా అనే కోణంలో కూడా వివిధ దేశాలు అత్య‌వ‌స‌రం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: