ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రంగుల రగడ  రగులుతున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆయా పార్టీల రంగులు  వేస్తూ ఉంటాడు. గతంలో కాంగ్రెస్ హయాంలో చూసాం కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇళ్లు కట్టిస్తే ఏకంగా కాంగ్రెస్ జెండా కలర్ లను  వేసేవారు. తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలు భవనాలకు పసుపు రంగు వేసారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాలు కార్యాలయాలకు  తమ పార్టీ జెండా రంగులు వేస్తున్న విషయం తెలిసిందే. 

 

 ఇక ఈ రంగుల విషయంలో అటు ప్రతిపక్షం అధికార పార్టీల మధ్య పలుమార్లు విమర్శల పర్వం కొనసాగింది. చివరికి ఈ రంగుల వివాదం కాస్త ఏకంగా కోర్థుల  వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ రంగుల విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే వైసీపీ రంగులు తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా తమ పార్టీ రంగుతో పాటు మరో రంగు  కూడా వేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పిటిషన్ వేసింది. అయితే దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 

 


 అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు భవనాలకు ఏ రంగులు వేయాలి అనే విషయంలో ఇక న్యాయస్థానం తుది నిర్ణయానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే కాంగ్రెస్ హయాంలో కానీ టిడిపి పార్టీ హయాంలో కానీ ప్రభుత్వ కార్యాలయాలకు లేదా పలు పథకాలు కూడా పార్టీకి సంబంధించిన రంగులు కనిపించాయి.  కానీ ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కోర్టులు ఈ రంగుల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. మరి కోతులు చెప్పిన విధంగానే రంగుల విషయంలో కోర్టులో  నిర్ణయిస్తారా  లేకపోతే.. కోర్టు  నిర్ణయం తో జగన్ సర్కార్  విమర్శల పాలవుతుందా  అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: