చంద్రబాబు రాజకీయం వేరుగా ఉంటుంది. తాను అనాల్సినవి అనేస్తారు. ఎదుటి వారి మీద బురద జల్లేస్తారు. తుడుచుకోమంటారు. వారే బాధితులు కావాలి తప్ప తాను బురద జల్లడం మానరు. ఇక బాబు ఆరోపణలు పదే పదే చేస్తారు. ఎందుకంటే ఒకసారి చేసిన ఆరోపణ నమ్మకపోయినా పదిసార్లకైనా జనం బుర్రల్లోకి వెళ్తుందని ఆయన గారి నమ్మకం.

 

సరే ఇపుడు బాబు గారు సవాళ్ళు, ప్రతిసవాళ్ల విషయానికి వద్దాం. సహజంగా బాబు గారు సవాళ్ళు చేయరు. ఇంకోరు చేసినా పట్టించుకోరు. ఇపుడు బాబు గారికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి సవాల్ వచ్చింది. అదేంటి అంటే విశాఖ ఎల్జీ పాలిమర్స్ కి అనుమతులు ఎవరు ఇచ్చారు అన్న దాని మీద చర్చకు రా బాబూ అంటూ విజయసాయిరెడ్డి  బస్తీ మే సవాల్ అంటున్నారు.

 

ఈ విషయంలో అసలు నిజం ఇదీ అంటూ జగన్ ఈ మధ్యన బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారాంలో ఉండగానే హిందుస్థాన్ పాలిమర్స్ అనుమతులు వచ్చాయని ఆయన చెప్పుకొచారు. వారు అన్ని క్లియరెన్సులు ఇచ్చారని, ఇపుడు తమపైన నిందలు వేస్తున్నారని కూడా జగన్ అన్నారు. అయితే దాని మీద చంద్రబాబు కౌంటర్ అటాక్ చేశారు. మేము అనుమతులు ఇవ్వలేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.

 

కావాలంటే నిరూపిస్తాను అని కూడా బాబు అన్నారు. తండ్రీ కొడుకులు అంటే వైఎస్సార్, జగన్ మాత్రమే ఎల్జీ పాలిమర్స్ కి అనుమతులు ఇచ్చారు అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దాన్ని ఇపుడు విజయసాయిరెడ్డి పట్టుకున్నారు. ఎవరు ఎపుడు అనుమతులు ఇచ్చారో చర్చిద్దాం. తేల్చుకుందాం వస్తారా బాబూ మీరు విజయవాడ వచ్చినా నేను హైదరాబాద్ రావాలా ఏదినా మీ ఇష్టం, కానీ చర్చకు రండి బాబుగారు అంటున్నారు.

 

ఇక్కడ చంద్రబాబు చర్చకు వస్తారని ఎవరూ అనుకోరు. ఇక విజయసాయిరెడ్డి సవాల్ తరువాత ఆ విషయం ఆయన అంతటితో ఆపేస్తారని కూడా అనుకోవడానికి వీలులేదు. మళ్లీ మళ్ళీ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ పాపం వైసీపీదేనని అంటారు. ఇది ఎప్పటికీ తేలని కధే. దాని బదులు బాబు ఏ టైంలో ఎలా అనుమతులు ఇచ్చారో ప్రభుత్వమే ముందుకు వచ్చి బయట పెడితే బాగుంటుంది. లేదా సంబంధిత మంత్రులు మీడియా ముఖంగా అన్ని విషయాలూ ఆధారాలతో బయటపెడితే జనాలకు కూడా క్లారిటీ వస్తుంది. అంతే తప్ప సవాళ్ళు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు, ఉత్త రాజకీయం తప్ప.

మరింత సమాచారం తెలుసుకోండి: