పోలీసులంటే ఎప్పుడు ప్రజలు భయపడుతుంటారు. ఇక పోలీసులు ఎప్పుడూ సీరియస్ గా ఉంటారని ప్రజల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని అనుకుంటారు. కానీ పోలీసు అధికారుల్లో  కూడా ఎంతో మానవత్వం కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన  కూలీలు స్థలాలకు వెళ్ళడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణ సౌకర్యం కల్పించగా చాలా మంది వలస కార్మికులు నడిచి  వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే శ్రామిక్ రైళ్ల ద్వారా వెళ్లాలంటే అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా రైలు దిగిన తర్వాత క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. అందుకే నడక మార్గం ద్వారా వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు వలస కార్మికులు. 

 


 అయితే వలస కార్మికులు ఎక్కువగా నడిచి  తమ స్వస్థలాలకు వెలుతున్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది వలస కార్మికులు ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులకు చేరుకున్న సమయంలో విజయనగరం ఎస్పీ రాజకుమారి మానవత్వాన్ని చాటుకుని  పోలీసుల్లో  కూడా మానవత్వం ఉంటుంది అని నిరూపించారు. మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులను  అధికారులు ఆపేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి కార్మికులను కొందరిని విజయనగరం వద్ద ఆపారు పోలీస్ లు. అయితే వారిలో  కొందరు ఎప్పుడో పేపర్లలో వేసినప్పుడు ఎస్పీ రాజకుమారి నెంబర్ని తీసుకున్నట్టున్నారు. 

 


వెంటనే కాల్ చేసి  ఎంతో  దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాము  మేడం.. ఇంకాసేపు అయితే పడిపోయేలా ఉన్నాము.. మాకు ఏదైనా ఆహారం ఏర్పాటు చేయండి అంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్పీ రాజకుమారి పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ రాత్రి సమయంలో ఎక్కడ దుకాణాలు తెరిచి లేవు. దీంతో ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎస్పీ రాజకుమారి వెంటనే పులిహోర చేసుకుని ఘటనా స్థలికి చేరుకుంది . అయితే అప్పటికే ఆ వలస కార్మికులను క్వారంటైన్ కి  తరలించారు పోలీసులు. క్వారంటైన్ లోకి  వెళ్లి వలస కార్మికుల తో పాటు ఇంకా మరి కొంత మందికి ఆహారాన్ని అందజేసింది ఎస్పీ రాజకుమారి. ఎస్పీ రాజకుమారి చేసిన పని ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: