ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారి బారిన పడి భయం గుప్పిట్లోనే ఉంటున్నాయి. ఇక ప్రపంచ దేశాల ప్రజలందరూలో  ఈ మహమ్మారి వైరస్ కు సంబంధించిన భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న మహమ్మారి వైరస్ రోజురోజుకు విజృంభిస్తు ఎంతో  మందిని బలి తీసుకుంటుంది. ఇక అగ్రరాజ్యాల్లో  అయితే పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారిపోతుంది . అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడిచి పోతున్నాయి...  తప్ప వ్యాక్సిన్ మాత్రం అందుబాటులోకి రావడం లేదు అన్న విషయం తెలిసిందే. 

 


 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మహా మహా శాస్త్రవేత్తలు సైతం ఈ మహమ్మారి వైరస్  కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. అయితే ప్రస్తుతం అమెరికా బ్రిటన్ జర్మనీ చైనాలో ఈ వ్యాక్సిన్ కి  సంబంధించిన పరిశోధనలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అన్నిటికంటే వేగంగా ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ ఈ మహమ్మారి వైరస్ తయారీని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ కరోనా  వైరస్కు ఒక వాక్సిన్  తయారు చేసి ముందుగా పరీక్షించింది. మొదటి ప్రయత్నంలో విజయం సాధించడంతో తాజాగా కోతులపై ప్రయోగించారు ఈ విరుగుడు. 

 


 అయితే కోతులపై ప్రయోగించగా కరోనా వైరస్  కోసం తయారు చేసిన ఈ వ్యాక్సిన్ కాస్త విఫలం అయింది. ఈ వ్యాక్సిన్  కేవలం నిమోనియా పై మాత్రమే సమర్థవంతంగా పోరాడుతుంది అని తేలింది. కాని కరోనా పై  మాత్రం ఈ వ్యాక్సిన్ ఎదుర్కోలేక పోతుంది అన్నది తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. దీంతో ప్రపంచదేశాల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఎందుకంటే మొదటి ప్రయత్నం విజయవంతం అవడంతో త్వరలోనే ఈ మహమ్మారి వైరస్ కు వ్యాక్సిన్  అందుబాటులోకి వస్తుందని... దీంతో అందరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడవచ్చు అని అనుకుంటున్న తరుణంలో ఈ వైరస్ విఫలం కావడం అందరికీ నిరాశే మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: