నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న తెలంగాణ ఏపీ రాజకీయ నేతల మధ్య నీటి వివాదాలు నెలకొన్నాయి. పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 203 ఇవ్వటంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యాయి. పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఒక్కసారిగా సీరియస్ అయ్యింది. పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం పెంచే దిశగా మరో లిఫ్ట్ ప్రాజెక్ట్ ని చేపట్టి రాయలసీమకు ఎక్కువ నీరు అందించడానికి కృష్ణానది నుంచి తోడాలని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ సర్కార్ అడ్డుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే. దీన్ని  డీల్ చెయ్యడం లో భాగంగా  ఏపీ ప్రభుత్వం విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుకి తెలంగాణ సర్కార్ లెటర్ రాయడం జరిగింది.

 

అయితే ఈ సందర్భంగా కృష్ణా నది నీటి వాడకం విషయంలో అన్ని నిబంధనలకు అనుగుణంగానే వెళ్తున్నట్లు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ఏపీ కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుకి తన వాదన వినిపించింది. ఇదే సమయంలో శ్రీశైలంలో 881 అడుగుల కంటే నీటి మట్టం తగ్గితే రాయలసీమకు నీటి తరలింపు చాలా కష్టసాధ్యం గా మారుతుంది. 854 అడుగులకు ప్రాజెక్టులో నీటిమట్టం పడిపోతే ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా తరలించడానికి వీలుపడుతుంది. ఈ సందర్భంగా ఈ విషయంలో నీటి మట్టం వుంచడానికి  తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ తన వాదన తెలియజేసింది. ప్రాజెక్టులో నీటిమట్టం పడిపోయినా గాని ఎడమగట్టు ద్వారా తెలంగాణ కొన్ని వేల క్యూసెక్కుల నీరు తరలించి పోతుందని కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు ముందు ఏపీ సర్కార్ వాపోయింది.

 

గత ప్రభుత్వం నుండి ఈ విధంగా తెలంగాణ వ్యవహరించింది అన్ని కృష్ణ ట్రిబ్యునల్ ముందు ఏపీ  తెలిపింది. ఈ విషయం నడుస్తూ ఉండగానే అప్పట్లో తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ ఓపెనింగ్ కార్యక్రమానికి జగన్ వెళ్లడం జరిగింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ సర్కార్ అని కూడా చాలా తెలివిగా వ్యవహరించిన నేపథ్యంలో ఇప్పుడు ఏపీ సర్కార్ ఎంత వాదించినా కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు ఎక్కువగా తెలంగాణ సర్కార్ కి మద్దతు తెలుపుతుంది. తాజాగా పోతిరెడ్డిపాడు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీరు కంటే ఎక్కువ వాడుకుంటోందని కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు తేల్చి చెప్పడం గమనార్హం. అంతే కాకుండా వెంటనే సాగర్ కుడి కాలువ హంద్రీనీవా, మచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కృష్ణా ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసి ఏపీకి షాక్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తంమీద ప్రస్తుత పరిస్థితులు బట్టి చూసుకుంటే కే‌సి‌ఆర్ ని తలదన్ని ఎదిరించే వాదన ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర లేదని పలువురు మేధావులు అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో కూడా జగన్ దూకుడు గా వ్యవహరించడానికి గల కారణం ఏంటో తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: