మందుబాబుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మద్యం రేట్లు ఎక్కువ అయ్యాయని బాధపడుతున్న బాబు మంచి బ్రాండ్స్ కావాలంటున్నారు. నాసిరకం బ్రాండ్స్‌తో ప్రజల ఆరోగ్యం పాడవుతుందని అంటున్నారు. అయితే మద్యపాన నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం వెళుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే షాపులు తగ్గించింది, రేట్లు కూడా పెంచింది. రేట్లు పెంచితే మద్యం కొనుగోళ్ళు తగ్గుతాయని జగన్ ప్రభుత్వం భావించి ఆ పని చేసింది.

 

ఇక లాక్ డౌన్ తర్వాత కూడా మద్యం ధరలని 75 శాతం వరకు పెంచింది. దీంతో మందు కొనాలనుకునే మందుబాబులు కాస్త ఆలోచిస్తున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే జగన్ అనుకున్న దశల వారీ మద్యపాన నిషేధం సక్సెస్ అయ్యే దిశగా వెళుతుంది. కానీ దీనిపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మందు రేట్లు పెంచడం అన్యాయమని చెబుతున్నారు. ఒక్క మద్యంపైనే రూ. 30వేల కోట్లు ఆదాయం వస్తుందంటున్నారు.

 

అలాగే నాసిరకం మద్యంతో ప్రజలకు అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉందని, నాసిరకం, పనికిమాలిన బ్రాండ్లు తీసుకువచ్చి అమ్ముతున్నారని, డబ్బుల కోసం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టుపెట్టడం సరికాదని బాబు మందుబాబుల కోసం తాపత్రయ పడుతున్నారు. అయితే ఏపీలో కొత్త బ్రాండ్లు అమ్మకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి బ్రాండ్లు ఉన్నాసరే మందుబాబు బాగానే కొని తాగుతున్నారు. ఎక్కడా బ్రాండ్లపై అభ్యంతరం చెప్పలేదు. కానీ టీడీపీకి చెందిన వ్యక్తులు మాత్రం కొన్ని వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

 

ఏపీలో చెత్త బ్రాండ్లు అమ్ముతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ బ్రాండ్లు కూడా తయారయ్యేది, గతంలో చంద్రబాబు ఏవైతే డిస్టలరీలకు పర్మిషన్ ఇచ్చారో, అవే ఈ బ్రాండ్లు తయారు చేస్తున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాబట్టి కొత్త బ్రాండ్లు వచ్చినా, అవి నాసిరకం అనే దానిలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. కానీ వైసీపీ నేతలు అలా అంటుంటే బాబు మాత్రం మంచి బ్రాండ్స్ కావాలని అడుగుతున్నారు. మరి బాబు డిమాండ్‌ని జగన్ ప్రభుత్వం నెరవేరుస్తుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: