సోషల్ మీడియా రాజకీయాలకు అడ్డాగా మారిపోయిన విషయం తెలిసిందే. పార్టీల వారీగా సోషల్ మీడియా విభాగాలు ఉంటున్నాయి. కార్యకర్తలు ఉంటున్నారు. ఇక అక్కడే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుద్ధంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు బాగా యాక్టివ్ గా ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు ట్రోల్స్ వేస్తుంటే...జగన్, వైసీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు ట్రోల్స్ వేస్తున్నారు.

 

ప్రత్యర్ధి పార్టీ వాళ్ళు తమ అధినేతలని ఏమన్నా అంటుంటే వెంటనే కౌంటర్లు ఇస్తున్నారు. అయితే కౌంటర్లు ఇచ్చే విషయంలో కొందరు అసభ్యంగా కూడా ఇస్తున్నారు. ఇలా అసభ్యంగా, అర్ధంపర్ధం లేకుండా విమర్శలు చేసే వారిపై జగన్ ప్రభుత్వం కాస్త కఠినంగానే ఉంటుంది. ఇప్పటికే తమ ప్రభుత్వంపై విషం చల్లే పలువురు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు కూడా పెట్టారు. తాజాగా ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించి జగన్ ప్రభుత్వానికీ పలు ప్రశ్నలు సంధించిన 66 ఏళ్ల ముసలావిడపై కూడా కేసు పెట్టారు.

 

ఇదే సమయంలో చంద్రబాబు, లోకేశ్ ఇతర టీడీపీ కార్యకర్తలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపై ఇంతవరకు ఒక్క కేసు నమోదైన దాఖల లేదు. అయితే టీడీపీ నేతలు పలు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ యాక్షన్ తీసుకున్న సందర్భాలు లేవు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత బుచ్చయ చౌదరీ కూడా తనపై వైసీపీ వాళ్ళు అసభ్యకరంగా పోస్టు చేశారని చెబుతూ కేసు పెట్టారు.

 

ఫోటోలు మార్ఫ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించారని, వైసీపీ స్టేట్‌ ఐటీ జనరల్‌ సెక్రటరీ కలకడ శ్యామ్‌, సవింద్రరెడ్డి, కుంచల సింహపురిపై బుచ్చయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే బుచ్చయ్య పెట్టిన కేసుపై యాక్షన్ తీసుకుంటారనేది కాస్త డౌట్‌గానే ఉంది. ఏదేమైనా అధికారంలో ఉన్నవారి మీద యాక్షన్ తీసుకోవడం కష్టమేలే. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా అలాగే జరిగిందిగా.

మరింత సమాచారం తెలుసుకోండి: