ఇండియా పై చాలా తెలివిగా కరోనా వైరస్ తన ప్రభావం చూపుతోంది. ప్రపంచంలో విజృంభించిన అన్ని దేశాలలో రోజుల వ్యవధిలోనే చాలా డేంజరస్ గా విస్తరించి తన ప్రభావం చూపించింది. కానీ ఇండియాలో మాత్రం ప్రపంచ దేశాలలో వ్యాపించిన దానికి భిన్నంగా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. చాపకింద నీరులాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. సాధారణంగా ఈ వైరస్ బయట పడిన సమయంలో చైనా పక్కనే ఇండియా ఉండటంతో ప్రపంచ దేశాలు ఇండియా పని అయిపోయింది అని అనుకున్నారు. తక్కువ భూభాగంలో ఎక్కువ జనాభా సాంద్రత కలిగిన దేశం, పైగా ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా దేశం కావడంతో ఇండియాలో వైరస్ దారుణంగా విజృంభించడం గ్యారెంటీ అని భావించారు.

 

 కానీ కేంద్ర ప్రభుత్వం వైరస్ దేశంలో ఎంటరైన స్టార్టింగ్ లోనే లాక్ డౌన్ ప్రకటించి చాలా పటిష్టంగా దేశవ్యాప్తంగా అమలు చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి బాగా సహకరించారు. యూరప్ దేశాల ప్రజల మాదిరిగా కాకుండా చాలా బాధ్యతాయుతంగా భారతీయులు కరోనా వైరస్ తో పోరాడటం జరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో కరోనా వైరస్ తో ఇండియా బాగా పోరాడుతోందని ప్రశంసలు దక్కాయి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎక్కడా కూడా కరోనా వైరస్ కంట్రోల్ అయిన సందర్భలు  మాత్రం కనబడటం లేదు. రోజురోజుకీ పాజిటివ్ కేసులు బయటపడటంతో పాటు లాక్ డౌన్ ‘నమ్ కే వాస్తే’ లాగా రూల్స్ ఉండటంతో ప్రజలు యధావిధిగా తిరుగుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే కరోనా విశ్వరూపం ఇండియాలో కోరలు బయటపడుతున్నాయి.

 

ఒకవైపు వలస కూలీలు కూడా గుంపులు గుంపులుగా తమ సొంత గ్రామాలకు వెళుతున్న తరుణంలో భయంకరంగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం దేశంలో లక్షకుపైగా పాజిటివ్ కేసులు దాటడంతో… పక్క వ్యక్తిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 135 కోట్ల మందికి పైగా ఉన్న భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే.. ఆ పరిస్థితిని కంట్రోల్ చేసే వైద్య సదుపాయం ఇండియా దగ్గర లేదని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇండియాలో ఉన్న ప్రజలు వ్యాక్సిన్ వచ్చేవరకు సోషల్ డిస్టెన్స్ మరియు మాస్క్ పెట్టుకొని వ్యక్తిగత శుభ్రత కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య నిపుణులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: