మొన్న జరిగిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి డేంజరస్ గ్యాస్ లీక్ అవడంతో కంపెనీ చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం తో పాటుగా అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. నిద్రలో ఉండగానే చాలామంది స్పృహతప్పి పడిపోయి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పచ్చని చెట్లు, పశువులు కూడా ఈ ప్రమాదకరమైన గ్యాస్ వల్ల దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 12మంది చనిపోగా వందలాది మంది ఆసుపత్రి పాలవటం మనకందరికీ తెలిసినదే.

 

అయితే ఈ ఘటన విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధితులకు నష్టపరిహారం ఎవరూ ఊహించని రీతిలో ఇవ్వటంతో పరిస్థితి సద్దుమణిగింది. అదే సమయంలో లీక్ అవుతున్న గ్యాస్ కూడా వెంటనే కంట్రోల్ చేయటంతో విశాఖ వాసుల అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విషయం గురించి ప్రతిపక్ష టీడీపీ అధికార పార్టీ వైసీపీ పై సంచలన ఆరోపణలు అప్పట్లో చేసింది. అటు వంటి ప్రమాదకరమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి అనుమతులు జగన్ సర్కార్ ఇచ్చిందని.. ప్రజల ప్రాణాలతో వైసిపి ఆడుతోందని అనేక రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో ఇటీవల గ్యాస్ లీక్ బాధితులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భంలో అసలు ఈ కంపెనీకి అనుమతులు వచ్చింది 1996వ సంవత్సరంలో చంద్రబాబు హయాంలో అని అన్నారు. విభజన జరిగిన తర్వాత 2015లో ఇచ్చిన అనుమతులు సడలింపులు బాబు సర్కార్ చేసిందని షాకింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వెంటనే ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు వైసీపీ కి ఛాలెంజ్ విసిరారు. నిరూపించాలని మీడియా సాక్షిగా సవాల్ చేశారు. అసలు జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఇటీవల మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా చంద్రబాబు విసిరిన సవాలును స్వీకరిస్తున్నట్లు వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు.

 

సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి ఈ విధంగా కామెంట్లు చేశారు… 'చంద్రబాబు గారూ... ఎల్జీ ప్లాంట్ కు అనుమతులపై చర్చకు వస్తారా అని అడిగారు. మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?' అంటూ పోస్ట్ పెట్టారు. 'రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదు. వీళ్లు 20 లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్ చేస్తే సీఎం గారు కోటి ఇస్తారు. వీళ్లకు ఆలోచన మెదిలే లోపే ఆయన అమలు చేస్తున్నారు. గొప్ప సలహా ఏదైనా ఇస్తే, పాటించకూడదని పట్టుదలకు పోయే స్వభావం కాదాయనది. కానీ వీళ్లకు ఆ స్థాయి ఏదీ?' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాగా ఇదివరకు లాగా ఘాటుగా మాట్లాడకుండా  విజయసాయిరెడ్డి చాలా లాజికల్ గా మాట్లాడటంతో వైసీపీ శ్రేణులు హుషారు చెందారు. మరి ఈ చాలెంజ్ ప్రక్రియలో టిడిపి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: