రైల్వే ప్ర‌యాణికుల‌కు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ ఒక‌టో తేదీ నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు గురువారం ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. టికెట్లు  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లు బంద్‌ ఉంటా యి. నాన్‌ ఏసీతోపాటు ఏసీ కోచ్‌లనూ నడుపనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు  ఉన్నాయి. ఇందులో తెలంగాణ రైళ్లు ఇలా ఉన్నాయి.. ఢిల్లీ-హైదరాబాద్‌: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ముంబై-హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్‌, హౌరా-సికింద్రాబాద్‌: ఫలక్‌ను మా ఎక్స్‌ప్రెస్‌,  సికింద్రాబాద్‌-డనపూర్‌ సూపర్‌ఫాస్ట్‌, గుంటూరు-సికిం ద్రాబాద్‌: గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి-నిజామా బాద్‌: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌. ఇక రైల్వేశాఖ ఈ క్రింది సూచ‌న‌లు చేసింది. గరిష్ఠంగా 30 రోజుల ముందు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేసుకోవచ్చు.

 

ప్రయాణికులు 90 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలి. మాస్క్‌ ధరించడం, ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతినిస్తారు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటుంది. కన్ఫర్మ్‌ అయితేనే రైల్లోకి అనుమతిస్తారు. ఈ నేప‌థ్యంలో రైల్వే ప్ర‌యాణికులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపుగా మార్చి వివ‌రివారంలో రైళ్ల రాక‌పోక‌లు బంద్ అయ్యాయి. అప్ప‌టి నుంచి నాలుగు ద‌శ‌ల్లో లాక్‌డౌన్‌ను పొడిగించ‌డంతో రైళ్లు తిరిగి ప్రారంభం కాలేదు. నాలుగో ద‌శ లాక్‌డౌన్ మే 31వ తేదీతో ముగుస్తుండ‌డంతో రైల్వేశాఖ జూన్ ఒక‌టో తేదీ నుంచి రైళ్లు న‌డిపించేందుకు రెడీ అవుతోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటూనే రైళ్లు న‌డిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తోంది. ఇక రైల్వే శాఖ సూచ‌న‌లు పాటిస్తే.. హాయిగా ప్ర‌జ‌లు రైళ్ల‌లో ప్ర‌యాణించే అవ‌కాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: