ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల్లోని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. కరోనా కష్ట కాలంలోను సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జగన్ పేద, మధ్య తరగతి వర్గాలకు అండగా నిలుస్తున్నారు. 
 
తాజాగా వైయస్ జగన్ రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు 5,500 రూపాయలు జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం జగన్ రైతుల కొరకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల కోసం ఒక ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించారు. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాగ్రీన్స్.కామ్ పేరుతో ఆన్ లైన్ మార్కెటింగ్ వెబ్ సైట్ ను ప్రారంభించామని ఈ వెబ్ సైట్ వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. 
 
ఈ ఆన్ లైన్ మర్కెటింగ్ వెబ్ సైట్ పండ్లు, కూరగాయలను రైతుల నుంచి కొనుగోలు చేసి వాటిని ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తుందని తెలిపారు. కొనుగోలుదారుడి ఇంటికి పండ్లు, కూరగాయలను డెలివరీ చేస్తుందని తెలిపారు. ఈ వెబ్ సైట్ ద్వారా రైతులకు, వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల గత 50 రోజులుగా ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయని అన్నారు. 
 
రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు అమలు చేస్తూ ఉండటంతో నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలు అన్నీ మరలా ప్రారంభమవుతున్నాయని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 68 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2407కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 53 మంది కరోనా భారీన పడి మృతి చెందారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: