ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్  మహమ్మారి విజృంబిస్తు  అందరిని  ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి వైరస్ యుద్ధంలో ప్రస్తుతం హెల్త్ వర్కర్స్ డాక్టర్ల పాత్ర ఎంతో కీలకమైనది. వీళ్లు ప్రత్యక్షంగా ఈ మహమ్మారి వైరస్ తో పోరాటం చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరి దేశాన్ని కాపాడేందుకు శ్రమిస్తున్నారు హెల్త్ వర్కర్స్. అయితే ఇక్కడ ఓ నర్సు కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్సను అందిస్తోంది. కాని కరోనా చికిత్స  కంటే ఈ నర్సు  వ్యవహారమే ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా  పేషెంట్లకు చికిత్స అందిస్తున్న నర్సులు అందరూ పిపిఈ కిట్లు ధరిస్తున్న విషయం తెలిసిందే. 

 


 ఈ నర్సు కూడా పీపీఈ కిట్లు దరించింది. కానీ లోపల ఎలాంటి బట్టలు లేకుండా కేవలం లో దుస్తులతో మాత్రమే పిపిటి కిట్ ధరించి పురుషుల వార్డులో కరోనా  రోగులకు  చికిత్స అందిస్తుంది. రష్యా  తలా ప్రాంతంలోని రీజనల్ హాస్పిటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.పీపీఈ  సూట్ ధరించిన ఆ నర్సు లోపల బట్టలు వేసుకోకుండా 
 చికిత్సను అందిస్తోంది.దీంతో శరీరం మొత్తం  బయటకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ నర్సుకి  సంబంధించిన ఒక ఫోటో ని క్లిక్ మనిపించిన కొంతమంది దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా  అది కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే హాస్పిటల్ యాజమాన్యం దీన్ని  అంత సీరియస్గా తీసుకోకపోయిప్పటికీ రీజినల్ హెల్త్ మినిస్ట్రీ మాత్రం తేలిగ్గా  తీసుకోలేదు. 

 


 సదరు నర్సు డ్రెస్ కోడ్ ఉల్లంఘించినదని  దీనిపై వివరణ ఇవ్వాలంటూ హాస్పిటల్ నిర్వాహకులు ఆదేశించారు. ఇక దీనిపై ఆమె  విచిత్రమైన సమాధానం చెప్పుకొచ్చారు . పీపీఈ  సూట్  ధరిస్తే చాలా వేడిగా ఉంటుందని ఆ వేడిని తట్టుకోలేక లో దుస్తులు ధరిస్తున్నాను  అంటూ చెప్పుకొచ్చింది. అయితే హాస్పిటల్ లో తనకు కేటాయించిన పీపీఈ కిట్స్  పారదర్శకంగా ఉండటం వల్ల తన లోదుస్తులు బయటికి కనిపిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. దీంట్లో  తన తప్పు ఏముంది అంటూ ప్రశ్నించింది. ఇక తాను ధరించిన వి లో దుస్తువులు కాదని టూ పీస్ బికినీ అంటూ చెప్పుకొచ్చింది. ఇక నర్స్ వివరణపై ఉన్నతాధికారులు మాత్రం సంతృప్తి చెందలేదు. దీంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. అయితే దీనీపై  నెటిజెన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. వైద్య సిబ్బంది సమస్యలను ఆ నర్సు ఇలా చెప్పింది అంటూ కొంతమంది చెబుతుంటే ఇలా వైద్యం చేస్తే తొందరగా కోలుకుంటారు అని మరికొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: