దేశంలో కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి అత్యంత వేగంగా కేసులు పెరుగుతూ వచ్చాయి.  మొదట కేరళాలో మొదలైనప్పటికీ.. దీని ప్రభావం మాత్రం ఇప్పుడు మహారాష్ట్రపై భారీగా పడింది.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ముజాహిద్దీన్ మర్కజ్ సమావేశాల్లో పాల్గొన్న తగ్లీబన్ ల వల్ల కరోనా వ్యాప్తి బాగా పెరిగిపోయిందని అంటున్నారు. ఇక దేశానికి వాణిజ్యపరంగా వెన్నుముఖ అయిన ముంబాయిలో కరోనా మరణ మృదంగం వాయిస్తుంది. మరణాల జాబితాలో దేశంలోనే మహారాష్ట్ర ముందుంది. ఇప్పటి వరకు అక్కడ 39,297 కేసులు నమోదు కాగా, 1,390 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.  ఇప్పటి వరకు దేశంలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి అంటే.. అది ముంబాయిలోనే అని చెప్పొచ్చు.  

 

ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వలస వెళ్లి జీవించేవారే ఎక్కువగా ఉంటున్నారు. ముంబాయిలో ఇప్పటి వరకు 24,118 కేసులు నమోదు కాగా, 841 మంది మరణించారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడే వెలుగుచూస్తుండడం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ముంబై మరో న్యూయార్క్‌గా మరే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం అమెరికాలో అత్యధిక మరణాల సంఖ్య అమెరికా అందులోనూ న్యూయార్క్ సిటీలో నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 21 శాతం ముంబైలోనే నమోదవుతుండడమే ఇందుకు కారణం.

 

కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల ఉద్ధృతి మాత్రం తగ్గడం లేదు. అటు న్యూయార్క్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ముంబైలో 32 వేలమందికిపైగా నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక దూరం అత్యాశే అవుతుంది. న్యూయార్క్‌లో 3.5 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 28 వేలమందికిపైగా మరణించారు. ముంబైలో కేసులు, మరణాలు ఆ స్థాయిలో లేకున్నా వేగంగా పెరగడంతో ముంబాయి వాసులు భయాందోళనలో బ్రతికే పరిస్థితి నెలకొంది. అందుకే వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: