ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ఎంత‌కూ త‌గ్గ‌డం లేదు. రోజు రోజుకు క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగి పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే వేల‌కు వేల మంది ప్ర‌తి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌నిపోతూనే ఉన్నారు. ఇక క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతోన్న ప‌రీక్ష‌లు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక రెండు రోజులుగా చూస్తే దేశంలో స‌గ‌టున రోజుకు 5 వేల కేసులు న‌మోదు అవుతున్నాయి. బుధవారం రికార్డు స్థాయిలో 5611 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో వైరస్ వ్యాప్తి నిరాటంకంగా కొనసాగుతోంది. 

 

ఇక క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు జ‌రుగుతోన్న ప‌రీక్ష‌లు.. ప్ర‌యోగాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముందుగా ప్లాస్మా థెర‌పీ వ‌చ్చింది. ఇక కోతులు.. కుక్క‌లు.. పిల్లుల‌పై ప్ర‌యోగాలు అన్నారు. ఇక ఇప్పుడు కొత్త‌గా న‌వ్వు ల‌తోనూ క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. నవ్వులతోనూ ఆ వైరస్ను తగ్గించవచ్చని వైద్యులు భావించి ప్రయోగాత్మకంగా ముంబైలో ప్రయత్నించారు. మ‌న‌దేశంలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా మ‌హారాష్ట్రాలోనే న‌మోదు అవుతున్నాయి. ఒక్క ముంబైలోనే ఏకంగా 20 వేల‌కు పైగా కేసులు ఉన్న సంగ‌తి తెలిసిందే. 

 

ఈ క్ర‌మంలోనే ముంబై.. మ‌హారాష్ట్రాలో క‌రోనా వైర‌స్ తీవ్ర నేప‌థ్యంలో అక్క‌డ రోగ‌ల‌కు స‌రికొత్త వైద్యం అందించేందుకు వైద్యులు స‌రికొత్త ప్ర‌యోగం మొద‌లెట్టేశారు. అదే లాఫింగ్ థెరపీని ప్రయోగించడం షురూ చేశారు. ముంబైలోని దాదర్స్ శిల్వ స్కూల్లో కరోనా బాధితుల కోసం ఆస్పత్రిగా రూపొందించారు. ఈ హాస్ప‌టల్లోనే వైద్యులు స‌రికొత్త ప్ర‌యోగం చేశారు. బెడ్ల‌పై చికిత్స పొందుతోన్న రోగుల చేత ఒక్క‌సారిగా ట‌ప్ప‌ట్లు కొట్టించారు. దీంతో వారంతా కాసేపు రెండు చేత‌ల‌తో ట‌ప్ప‌ట్లు కొట్ట‌గా ఆ ప్రాంగణం మార్మోగింది. 

 

ఈ క్ర‌మంలోనే వైద్యులు మాట్లాడుతూ రోగులు అంద‌రూ కాసేపు న‌వ్వుకోవ‌డంతో పాటు ఉత్సాహంగా ఉండాల‌ని.. అప్పుడే క‌రోనా నుంచి చాలా వ‌ర‌కు మాన‌సిక స్థైర్యంతో బ‌య‌ట ప‌డిపోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: