ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ తో గడ గడలాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. వైరస్ దెబ్బకు అమెరికా, బ్రిటన్ రష్యాలు అల్లాడిపోతున్నాయి.   ఇక  భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజులో మరోసారి 5,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.   ఇలాంటి సమయంలో కొంత మంది సైబర్ నేరగాళ్లు తమ పనులు కూల్ గా చేసుకుని వెళ్తున్నారు. మరోవైపు కొంత మంది కేటుగాళ్లు దొంగనోట్ల దందాలు మొదలు పెట్టారు.  ఊర్లు దాటి చేతులు మారి చివరికి టాస్మాక్‌ దుకాణంలో వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీని తరలిస్తున్న చెన్నైకి చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

 

పుదుకోట జిల్లా తిరుమయం సమీపం కీళతిరువాసగపురంకు చెందిన సంతోష్‌కుమార్‌ (33) చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సమయంలో నకిలీ నోట్ల దందా తో లక్షాధికారులు చూశారు. సంతోష్‌కుమార్‌ ఈ నెల 16వ తేది టాస్మాక్‌ షాప్ కి వెళ్లి రెండు రూ.200 నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేసేందుకు యత్నించగా, అవి నకిలీ నోట్లుగా గుర్తించిన టాస్మాక్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

 

పోలీసులు చేరుకుని సంతోష్‌కుమార్‌, అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులు రామచంద్రన్‌ (30), మహమ్మద్‌ ఇబ్రహీం (27)లను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై విల్లివాక్కం రాజాజీనగర్‌ 3వ వీధికి చెందిన సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, కన్నియకుమారి జిల్లా పుత్తనేరికి చెందిన మణికంఠన్‌ నకిలీ నోట్లు ముద్రించి, వాటిలో కొన్నింటిని తనకిచ్చి మార్చాలని కోరినట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పడి నాగర్‌కోయిల్‌లో మణికంఠన్‌ను అరెస్టు చేసి అతడి నుంచి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: