పెళ్లి కాకుండానే తన చెల్లిని గర్భవతి చేసిన ఒక యువకుడు పై ఆ అమ్మాయి ముగ్గురు అన్నలు హత్య చేయడానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఇక ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళితే... 


తమ చెల్లిని ప్రేమించి, గర్భవతిని చేశాడు అన్న కక్షతో ఆ యువతి ముగ్గురు అన్నలు సదరు యువకుడిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొండపాక మండలంలో వెలుగుచూసింది. సదరు యువతి వారి అన్నలతో సహా హైదరాబాద్ లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటుంది. అయితే మెదక్ జిల్లా మద్దూరు మండలం లోని బింగి శ్రీకాంత్ ఆ యువతితో కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. అయితే ఇక శ్రీకాంత్ కూడా హైదరాబాదులోని నాగారంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక హైదరాబాదులో ప్రేమికులు ఇద్దరు తరచూ కలుస్తూ ఉండేవారు. ఆ యువతి తరుచూ ప్రియుడి ఇంటికి వెళ్లి వచ్చేది. ఇదే క్రమంలో వారిద్దరూ శారీరకంగా కూడా కలిశారు. దీనితో ఆమె గర్భం దాల్చింది..

 


ఈ విషయాన్ని మంగళవారం నాడు యువతి వారి అన్నలకు తెలియజేసింది. అయితే వారిద్దరి పెళ్లి విషయం మాట్లాడదామని చెప్పి శ్రీకాంత్ ను వారి గ్రామానికి పిలిపించుకున్నారు. అయితే ఇక అక్కడ శ్రీకాంత్ ను వారి అన్నలు స్పృహ కోల్పోయేలా కొట్టి ప్రాణం పోయిందని కారులో ఎక్కించుకుని బందారం శివారులో మెడకు తాడు బిగించి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి ఒక బావి లోకి అతడిని తోసేశారు.

 


అయితే బావిలో కొద్దిమేర నీరు, పూడిక తీసిన గడ్డ ఉండడంతో శ్రీకాంత్ చావు నుంచి బయటపడడం జరిగింది. అయితే శ్రీకాంత్ కు మంగళవారం రాత్రి సృహలోకి రావడంతో చూస్తే బావి లో ఉండడం గమనించాడు. ఇక అంతటితో గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. కానీ ఇరవై గంటలు గడిచిన తర్వాతనే బుధవారం మధ్యాహ్నం అటుగా వెళ్తున్న ఒక గొర్రెల కాపరి అతని అరుపులు వినిపించడంతో వారు వెంటనే గ్రామ ప్రజలకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఇక ఆ తరువాత ఒక మంచాన్ని బావిలోకి దింపి శ్రీకాంత్ ను బయటికి తీసి చికిత్స కోసం సిద్ధిపేటకు అతనిని తరలించారు. అయితే బాధితుడికి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు అన్నదమ్ముల పై హత్య కేసు నమోదుచేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: