ఈ ఏడాది ఏంటో మనిషిపై ప్రకృతి మామూలుగా పగబట్టలేదు.  ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాల్లోకి చైనా నుంచి పెను భూతంలా వచ్చింది కరోనా. ఇది చేస్తున్న కరాళ నృత్యానికి ప్రజలు గజ గజ వణికి పోతున్నారు.  ఒక్కరోజులో మరోసారి 5,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది ప్రాణాలు కోల్పోయారు.  మరోవైపు ఎంఫాన్ తుపాను తో అల్లకల్లోలంగా మారింది.  ఆ మద్య విశాఖలో గ్యాస్ లీక్.. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఇలా జీవన వ్యవస్థ గందరగోళంగా మారిపోయింది.  మహానగరం నిప్పుల కుంపటిగా మారింది. ఉదయం ఎనిమిది గంటలకే ఇంటి నుంచి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. గడిచిన కొద్దిరోజుల నుంచి సుమారు 44 డిగ్రీల పై చిలుకు ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ఇంటి నుంచి బయటకొచ్చేందుకు జనం జంకుతున్నారు. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మొన్నటి వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా ఇంటిపట్టున ఉన్నారు.. అయితే లాక్ డౌన్ సడలిస్తున్న కారణంగా ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు.  ఇప్పుడు ఈ ఎండకు అల్లల్లాడుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా, అనారోగ్యం బారిన పడతారని, తగిన జాగ్రత్తలు వహించాలని ఇప్పటికే పర్యావరణ వేత్తలు, వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు సూచించటంతో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే మధ్యాహ్నం పూట ఎండ వేడిమి తట్టుకోలేక జనం బయటకు రావటం లేదు.

 

ఎండలు అధికంగా ఉండటం ద్వారా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది.  రోజు రోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో రోడ్లపై కర్ఫ్యూ వాతావ రణం  కనిపిస్తున్నది. ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పండ్ల రసాలు, ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీలు, కూలర్లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: