తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య చాపకింద నీరులాగా విజృంభిస్తోంది. దీనితో ప్రజల్లో భయాందోళనలు మొదలవుతున్నాయి. ఇన్నిరోజులు లాక్ డౌన్ అమలులో ఉంచి కేసులు పెరుగుతున్న తరుణంలో మళ్లీ లాక్ డౌన్ లో సడలింపులు చేసినప్పటికీ కూడా ప్రజలు వారివారి జాగ్రత్తలో ఉండటం చాలా మంచిది. ఇక భారతదేశంలో నేటి వరకు 3425 మంది చనిపోయారు. దీనితో ప్రజల్లో మరింత భయం పట్టుకుంది. అలాగే కరోనా మహమ్మారి భయంతో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటెన్ సెంటర్ కు తరలిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే వీరిలో చాలామంది హోమ్ క్వారంటైన్ లో కూడా ఉంచుతున్నారు. 


ఇది ఇలా ఉండగా తాజాగా ఒక  గిరిజన బాలింతను ఊరు లోకి రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ బాలింత ఆరు రోజులపాటు ఊరి బయటే ఉన్న చెట్టు నీడలో గడపడం జరిగింది. ఈ దారుణమైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులగూడలో చోటు చేసుకోవడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... బొప్పరికుంట పంచాయతీలోని రాజులగూడకు చెందిన అనసూయ దంపతులు ఉపాధి పనుల కోసం కరీంనగర్ కు వలస వెళ్లడం జరిగింది. 


ఇక మే 14న అనసూయ ఈనెల 12 న పాపకు జన్మనివ్వడం జరిగింది. ఇక వారు వారి సొంత ఊరికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెళ్లారు . అయితే అక్కడికి స్థానికులు వారిని గ్రామంలోకి అనుమతించలేదు. ఇక దీనితో ఊరి చివర ఒక చెట్టు కింద గుడారం వేసుకొని వారు జీవనం కొనసాగిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న వైద్యాధికారులు అక్కడకు చేరుకొని తల్లి బిడ్డకు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉన్నారు అని తెలియజేశారు. అంతేకాకుండా గ్రామస్తులను ఒప్పించి ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండే ఏర్పాటు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: