ఇటీవల కోమటిరెడ్డి రాష్ట్ర పీసీసీ పదవి తనకు వస్తే కనుక టిఆర్ఎస్ పార్టీ నీ కూల్చేస్తాను అంటూ ఓ ఇంగ్లీష్ చానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు, నేను పీసీసీ పదవి ఎక్కితే టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు రావటానికి రెడీగా ఉన్నారని కామెంట్ చేయడం జరిగింది. దీంతో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి. కనీసం పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు లేని కాంగ్రెస్ పార్టీలోకి  టిఆర్ఎస్ పార్టీ నుండి 50 మంది ఎమ్మెల్యేలు వెళ్ళటం అది కూడా కోమటిరెడ్డికి పీసీసీ పదవి వచ్చాక,  అనేసరికి ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. పైగా టిఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీగా రాణిస్తున్న ఇటువంటి సమయంలో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్ చేయడం టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా కొంత టెన్షన్ నెలకొంది.

 

ఇదే సమయంలో కోమటి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలోపేతం చేయడం కోసం పాదయాత్రలు మరియు బస్సు యాత్ర చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు కూడా తెలిపారు. దీనికోసం అధిష్టానం నుండి అనుమతులు రావాల్సి ఉందని టీవీ ఛానల్ లో వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సమయంలో ఇటీవల కోమటిరెడ్డి కి అధినేత్రి సోనియా గాంధీ నుండి ఫోన్ వచ్చినట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య దాదాపు గంట డిస్కషన్ తెలంగాణ రాజకీయాల గురించి జరిగినట్లు సమాచారం.

 

ఈ సందర్భంగా సోనియా గాంధీ ముందుగా కోమటిరెడ్డి సిద్ధం చేసిన సిద్ధం బస్సు యాత్ర, పాదయాత్ర కార్యచరణ ప్లానింగ్ మొత్తం తీసుకు రావాలని అన్నారట. ఇదే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవి గురించి టీ కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వంటి బలమైన నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో సోనియాగాంధీ నుండి కోమటిరెడ్డికి ఫోన్ రావడం అనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: