ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల ప్ర‌ణాళిక‌ల‌ను, ఆలోచ‌న‌ల‌ను కరోనా వైరస్‌ ఆవిరి చేసింది. ఈ మహమ్మారి ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయడంతో భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల‌న్నీ ఇప్పుడు పెట్టుబ‌డుల లెక్క‌ల‌పై ఆరా తీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అగ్ర‌రాజ్యం అమెరికా కీల‌క సూచ‌న‌లు చేసింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ మరియు దక్షిణాసియా అధికారి అలిస్ జి వెల్స్ ఈ మేర‌కు ప‌లు ముఖ్య సూచ‌న‌లు చేశారు. కరోనా భారత్‌కు మంచి చేసిందన్నారు. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత వైరస్ భారతదేశానికి అవకాశాలను అందిస్తుంది అని అలిస్ వెల్స్ చెప్పారు.

 

భారత్‌తో వ్యాపార‌ల ప‌రంగా మరింత ముందుకు వెళతామని అలిస్ జివెల్స్ తెలిపారు. భారతదేశం ఇప్పటికీ రక్షిత మార్కెట్ అయినందున అనేక సంస్కరణలు తీసుకురావాలని అమెరికా వంటి దేశాలకు ఇది అవసవరమని అలిస్ జి వెల్స్ అన్నారు. కరోనా వైరస్‌తో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోవాలని, అది కరోనా భారత్‌కు కల్పించిన సువర్ణావకాశమని పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశమని, నిర్ణయాలు కఠినంగా ఉన్నా అలాగే చేస్తామని స్పష్టం చేశారు.

 

ప్రపంచశక్తిగా భారతదేశం ఆవిర్భవించడాన్ని యూఎస్ స్వాగతించిందని,ఈ ప్రాంతంలో భద్రతా విషయంలో యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి ట్రంప్ పరిపాలన కట్టుబడి ఉందన్నారు. భారత దేశం సంస్కరణలు చేస్తే అమెరికా పెట్టుడబులు పెట్టడానికి సిద్దంగా ఉందని...కాని భారత్‌ ఆ స్థాయిలో ఒప్పందాలు చేసుకునేలా కనిపించడం లేదని చెప్పారు... అలా వ్యవహరించడం వల్ల అమెరికా ఒక్కదాంతోనే సమస్య కాదని..ఈయూ దేశాలు, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాలతోనూ భారత సంబంధాలు దెబ్బతింటాయన్నారు. భారతదేశం-యూఎస్ సంబంధంలో వాణిజ్యం రంగం చాలా ముఖ్యమైన భాగమని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాది దాదాపు 150 బిలియన్ డాలర్లను చేరిందన్నారు. ఇంకా అనేక  ఒప్పందాల కోసం ఇరు దేశాలు కృషి చేస్తూనే ఉన్నాయని...రెండు దేశాలు గత రెండేళ్లుగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని చూస్తున్నాయని అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: