రాజకీయాలలో అధికారంలో ఉన్న నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలు తమ పై అభిప్రాయం ఏవిధంగా చూపుతున్నారో అన్న దానిపై అవగాహన కచ్చితంగా ఉండాలి. ప్రజలలో ప్రభుత్వం పై స్పందన ఏమిటి?, పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అన్న దానిపై క్లారిటీ చాలా అవసరం. దీన్ని  డీల్ చెయ్యడం లో భాగంగా  తాను అధికారంలోకి వచ్చి ఏడాది అయిన నేపథ్యంలో జగన్ 'సొంత రివ్యూ' చేయించ బోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ తో సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయ్యారు. ప్రతి శాఖ పై జనాలు ఏ విధమైన స్పందన చూపిస్తున్నారు అన్న దాని గురించి మాత్రమే కాకుండా తన నిర్ణయాలపై ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి సెల్ఫ్ ఎనాలసిస్ కి రెడీ అవుతున్నారు.

 

దీనిలో భాగంగా ఈ నెల 25వ తారీకు నుండి వరుసగా ఐదు రోజులు జగన్ సమీక్షలు నిర్వహించబోతున్నారు. తొలి రోజున వ్యవసాయం, రెండో రోజు విద్యాశాఖ, మూడో రోజు వైద్య ఆరోగ్య శాఖ, నాలుగో రోజు గ్రామ/వార్డు వాలంటరీ వ్యవస్థ, చివరి రోజున ప్రణాళిక విభాగానికి చెందిన శాఖలతో సీఎం సమీక్ష జరపనున్నారు. ఇదే సమయంలో ప్రతి శాఖ కీ సంబంధించి భవిష్యత్తులో ప్రభుత్వం చేయబోయే పనుల గురించి కూడా ఈ సమీక్షలో జగన్ చర్చించనున్నట్లు సమాచారం.

 

ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఎంత వరకు వచ్చాయి, భవిష్యత్తులో ఏం చేయాలి అన్న దాని గురించి కూడా చర్చించ బోతున్నారు. మొత్తంమీద చూసుకుంటే ఈ నెల 30వ తారీఖున జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది కాబోతున్న తరుణంలో సొంత రివ్యూ పేరిట తెలివైన ప్లానింగ్ తో భవిష్యత్ కార్యక్రమాలు చేయటానికి జగన్ రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. చాలా వరకు జగన్ ఏడాది పరిపాలనపై ప్రజలకి సానుకూలమైన స్పందన ఉందని వైసీపీ పార్టీ నేతలు అంటున్నారు. ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు జగన్ అమలు చేస్తున్న తీరు జనాలను ఆకర్షిస్తుందని పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: