రాజీవ్ గాంధీ భారత రాజకీయ చరిత్రలో ఎంత గొప్ప నాయకుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత ఎదిగినప్పటికీ తల్లికి ఎక్కడ ఎదురు చెప్పని గొప్ప నాయకుడిగా.. ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకు వచ్చిన వ్యక్తిగా రాజీవ్ గాంధీకి భారత రాజకీయ చరిత్రలో కొన్ని పేజీలు లిఖించబడ్డాయి. అయితే తాజాగా తన తండ్రి రాజీవ్ గాంధీ ని ప్రియాంక గాంధీ గుర్తు చేసుకుంటూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా తన తండ్రి రాజీవ్ గాంధీతో చివరిగా దిగిన ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా తాజాగా ప్రియాంక గాంధీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 


 మీ పట్ల దయగా లేని వారి దగ్గర దగ్గర కూడా ఎంతో దయగా ఉండాలి . జీవితం న్యాయబద్దంగా   ఉన్న... అని న్యాయబద్దంగా  లేకపోయినా మీ ఊహలను మాత్రం మరవద్దు... ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉండాలి ... ఎంత చీకటిగా ఉన్నా లేదా తుఫానుకు భయపడిన... ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండాలి ... బలమైన హృదయాన్ని పెంపొందించుకోవాలి.. అంతేకాకుండా హృదయం నిండా ప్రేమను నింపుకోవాలి.. అది ఎంతో గొప్పది.. ఈ వ్యాఖ్యలు నా తండ్రి నాకు ఇచ్చిన జీవిత బహుమతులు అంటూ ప్రియాంక గాంధీ ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 


 అయితే అంతకుముందు వరకు ప్రియాంక గాంధీ ఎక్కడ తెరమీద కనిపించకపోయినప్పటికీ మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అధికార పార్టీని ఎదిరించడానికి ఎంతగానో ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారు  ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి గా ఏకంగా నేతలు  అందరు ప్రియాంక గాంధీని చేయాలని డిమాండ్ చేశారు అంటే ప్రియాంకగాంధీ తక్కువ సమయంలో రాజకీయాలను ఎంతలా  ప్రభావితం చేశారు అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: