ప్ర‌స్తుతం ఏపీలో లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ అంతా అత‌లా కుత‌లం అయ్యింది. ప్ర‌భుత్వానికి వ‌చ్చే ప‌న్నులు కూడా ఆగిపోవ‌డంతో పరిస్థితి గంద‌ర‌గోళంగా ఉంది. అయితే సీఎం జ‌గ‌న్ మొండి ప‌ట్టుద‌ల‌తో కేంద్రం నుంచి స‌హాకారం ఉన్నా లేక‌పోయినా కూడా ఏదోలా బండి నెట్టు కొచ్చేస్తున్నాడు. అయితే ఈ మూడు నెల‌ల లాక్ డౌన్ తో అస‌లే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ ఆర్థిక ప‌రిస్థితి మ‌రో యేడాదికి పైగా వెన‌క్కు వెళ్లి పోయింద‌నే చెప్పాలి. మ‌రో యేడాది పాటు వ్య‌వ‌స్థ‌లు అన్ని స‌క్ర‌మంగా కొన‌సాగితే కాని ఏపీ కోలుకునే ప‌రిస్థితి అయితే లేదు. ఇవ‌న్నీ ఇలా ఉంటే మ‌రో వైపు సంక్షేమ ప‌థ‌కాలు భారీ ఎత్తున అమ‌లు చేస్తున్నారు.

 

జ‌గ‌న్ ఇచ్చిన హామీలే కాకుండా.. ఇవ్వ‌ని హామీన‌లు సైతం నెర‌వేరుస్తున్నారు. మ‌రో వైపు వైజాగ్ ప్ర‌మాదంలో మృతుల‌కు ఏకంగా రు .కోటి ప‌రిహారం ఆఘ‌మేఘాల మీద ఇచ్చారు. అంతే కాకుండా ఓ 20 వేల మందికి ప్ర‌తి ఒక్క‌రికి రు. 10 వేలు అంటే మామూలు విష‌యం కాదు. ఇక చికిత్స పొందుతోన్న వారికి రు. ల‌క్ష‌ల ప‌రిహారం స రేస‌రి. ఓ వైపు రాబ‌డి లేదు. మ‌రో వైపు ఖర్చు చూస్తే విప‌రీతంగా ఉంది. మ‌రోవైపు ఇంత సంక్లిష్ట ప‌రిస్తితుల్లో మ్యానిఫెస్టో అమ‌లుకు ఏకంగా ఓ క్యాలెండ‌ర్‌నే విడుద‌ల చేయ‌డం పెద్ద సంచ‌ల‌నం అయ్యింది. అస‌లు ఏ రాష్ట్ర చ‌రిత్ర‌లోనూ ఇలా జ‌రిగి ఉండ‌దు.

 

మ్యానిపెస్టోలోని పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందజేసేందుకు తేదీల వారీగా ప్రకటించిన క్యాలెండర్‌ను జాగ్రత్తగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లపై ఉందని సీఎం జ‌గ‌న్ స్పష్టం చేశారు.  అన్నీ బాగానే ఉన్నా చిన్న లోపాలు.. అసంతృప్తులు మాత్ర‌మే ఇప్పుడు ప్ర‌భుత్వంపై ఉన్నాయి. ఈ క‌ష్ట‌కాలంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు జీతాల్లో స‌గం వ‌ర‌కు కోత విధించేశారు. ఈ కోత‌లు స‌హ‌జంగా వారిలో అసంతృప్తికి కార‌ణ‌మ‌య్యాయి. క‌రోనా క‌దా ? అని ఉద్యోగులు స‌రిపెట్టుకునే ప‌రిస్థితుల్లో లేరు. 

 

మా కమిట్ మెంట్లు మాకున్నాయ‌న్న‌ట్టుగా వారి శైలీ ఉంది. మ‌రి సంక్షేమ ప‌థ‌కాలు ఎలా అమ‌లు అవుతున్నాయ‌న్న ప్ర‌శ్న వారి నుంచి వ‌స్తోంది. ఇక వైజాగ్ మృతుల‌కు రు. కోటి పరిహారం ఇవ్వ‌డంతో కూడా ప్ర‌భుత్వ ఉద్యోగులు ప్ర‌శ్న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా ?  ప్ర‌భుత్వ ఉద్యోగుల అసంతృప్తిని మాత్రం జ‌గ‌న్ ముందుగా ఎలా చల్లారుస్తాడు ? అన్న‌దే చూడ‌లి.
   

 

మరింత సమాచారం తెలుసుకోండి: