ప్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా ఒక రాజ‌కీయం న‌డుస్తుంటే ఏపీలో మ‌రో రాజ‌కీయం నుడ‌స్తోంది. సీఎం జ‌గ‌న్‌కు ఎంత మొండి ప‌ట్టుద‌లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడిప్పుడే ఏపీ క‌రోనా సంకెళ్ల నుంచి బ‌య‌ట ప‌డుతూ వ‌స్తోంది. ఓ వైపు అంద‌రూ లాక్ డౌన్ పొడిగించాల‌ని చెపుతున్నా జ‌గ‌న్ మాత్రం ధైర్యం చేసి ఎప్పుడో చెప్పేశాడు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ మ‌రింత కాలం పొడిగించ కూడ‌ద‌ని.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌పై ఇది తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇక జ‌గ‌న్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి, సంక్షేమం పై పూర్తిగా దృష్టి పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

 

ఇక మార్చిలో జ‌ర‌గాల్సిన బ‌డ్జెట్ స‌మావేశాలు జూన్‌లో జ‌రుగ‌తాయ‌ని అంటున్నారు. జ‌గ‌న్ జూన్‌లో బ‌డ్జెట్ మీటింగ్ పెట్టుకునేలా క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయ‌ట‌. క‌రోనా తో సంబంధం లేకుండా జ‌గ‌న్ బ‌డ్జెట్ స‌మావేశాలు పెట్టేయాల‌ని.. అందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశించార‌ట‌. ఇక మండ‌లిని ర‌ద్దు చేసేందుకు జ‌గ‌న్ పంతం ప‌ట్టుకుని మ‌రీ కూర్చున్నారు. ఇప్ప‌టికే క‌రోనా లేకుండా అన్ని స‌వ్యంగా ఉండి ఉంటే క‌నుక‌... ఇప్ప‌టికే మండ‌లి ర‌ద్దు అయ్యి ఉండేది. 

 

ఇక మండ‌లి ర‌ద్దు కాక‌పోవ‌డంతో ఇప్పుడు సంప్ర‌దాయ ప్ర‌కారం మండ‌లి ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. అయితే మండ‌లిని ర‌ద్దు చేసేశాన‌న్న జ‌గ‌న్ దీనిని ఏర్పాటు చేయ‌డం ఇష్టం ఉన్నా లేక‌పోయినా.. రాజ్యంగ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి మండ‌లి స‌మావేశం ఏర్పాటు చేయాల్సిందే. అయితే జ‌గ‌న్ మాత్రం మండలి ర‌ద్దు విష‌యంలో ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసేసుకున్నందున అస‌లు మండ‌లిని స‌మావేశ ప‌ర‌చ కూడ‌ద‌నే అంటున్నార‌ట‌.

 

అయితే మ‌రో వైపు వైసీపీ నేత‌లు మాత్రం మండి ర‌ద్దు వ‌ద్ద‌ని.. మ‌రో రెండేళ్లు ఆగితే మండ‌లిలో వైసీపీ బ‌లం తిరుగు లేకుండా ఉంటుంద‌ని చెపుతున్నార‌ట‌. అయితే జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసేసుకున్నందున మ‌రి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి.
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: