దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారితో సతమతమవుతుంటే.. ఇప్పుడు ఉంపన్ తుపాన్ హడలిపోతున్నారు.  ఉంపన్ తుపాన్ తీరప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తోంది.  పశ్చిమ బెంగాల్‌లో ఉంఫాన్ తుఫాన్ పెను వినాశనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన బెంగాల్‌లో ఉంపన్‌ వల్ల భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే 72 మంది చనిపోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రకటించారు. కరోనాకంటే ఉంపనే ప్రమాదకరమన్న ఆమె రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు.  తుపాన్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఇప్పటి వరకు ఇలాంటి విధ్వంసం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు రాష్ట్రానికి రావాలని కోరారు.

 

తుపాను వల్ల రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల నష్టం జరగుతుందని ఆమె అంచనా వేశారు. అయితే కేంద్రం మాత్రం ఇంతవరకు మరణాసంఖ్యను ప్రకటించలేదు.  రాష్ట్ర అధికారులతో కలసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఒడిశా, బెంగాల్ తీరాల్లో గంటకు 185 కి.మీ. వేగంతో పెనుగాలు వీస్తున్నాయి. ఇక ఉంపన్ తుపాన్ తాకిడికి  కోల్‌కతాలో కార్లు బోల్తాపడ్డాయి. చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. రాజధాని కోల్‌కత్తా ప్రాంతంలో రవాణా వ్యవస్థ, విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. గాలులు,  భారీ వర్షాల కారణంగా కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌ పూర్తిగా నీట మునిగింది.

 

 పశ్చిమబెంగాల్‌లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది.  కాగా, పశ్చిమబెంగాల్‌, ఒడిసాల్లోని తీర ప్రాంత జిల్లాలపై ఆంఫన్‌ ప్రభావం భారీగా ఉందని ఐఎండీ పేర్కొంది. ఇరు రాష్ట్రాలోనూ భారీ గాలులు, వర్షాలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. హౌరా జిల్లా మణికాన్‌లో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: