పోలవరం అన్నది జగన్ కోరిక. అది పూర్తి చేసి ఆంధ్రుల గుండెల్లో చిరస్థాయిగా పేరు తెచ్చుకోవాలని జగన్ ఆశపడుతున్నారు. ఇప్పటికి ఒక విలువైన ఏడాది కాలం గడచింది. ఈ ఏడాదిలొనే భారీ వర‌దలు వచ్చి నాలుగు నెలలు పనులు ఆగాయి. ఆ తరువాత కాంట్రాక్టర్ని మార్చి మరొకరికి అప్పగించడంతో మరికొంత ఆలశ్యం అయింది. ఇక ఇపుడు కరోనా చేటు కాలం దాపురించింది.

 

ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు రానున్న కాలమంతా ఎంతో విలువైనది. పోలవరం పూర్తి చేయకపోతే మళ్ళీ జనాలకు జగన్ ఓట్లు అడగడానికి వెళ్ళినపుడు అదే పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. దాంతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో  భాగంగా  కేంద్రంతో కూడా తరచూ భేటీలు వేస్తూ నిధుల కోసం యత్నిస్తున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే పోలవరం వేగంగా పూర్తి కావడానికి అవసరం అయిన సలహాలు ఇచ్చేందుకు జగన్ కీలకమైన సలహాదారు పదవిలో తన తండ్రి కాలం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన  పి రమాకాంతరెడ్డిని నియమించనున్నట్లుగా సమాచారం. ఆయన జగన్ కి కూడా సన్నిహితుడే. జగన్ మీద సీబీఐ పెట్టిన కేసులు కోర్టులలో నిలబడవు అని గతంలో అనేక టీవీ డిబేట్లలో చెప్పిన రమాకాంతరెడ్డి ఈ మధ్య  కూడా జగన్ కి చాలా బాగా  ఉపయోగపడ్డారు.

 

ఏపీ ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించి రిటైర్డ్ మాజీ హైకోర్టు జడ్జి కనగరాజుని నియమించడం వెనక ఆయన సలహాలు కూడా ఉన్నాయని అంటారు. పాలనలో విశేష అనుభవం కలిగిన ఈ మాజీ అధికారిని కనుక పోలవరం ప్రాజెక్ట్ పురోగతి కోసం సలహాదారుగా నియ‌మించుకుంటే తొందరగా ఆ పనులు  పూర్తి చేయవచ్చునని జగన్ భావిస్తున్నారు మరి జగన్  దీనికి సంబంధించి కీలకమైన ఆదేశాలను తొందరలోనే విడుదల చేస్తారని అంటున్నారు. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: