ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో నేడు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2452కు చేరింది. గడచిన 24 గంటల్లో ఒకరు కరోనా భారీన పడి మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 2452కు చేరింది. 
 
చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారత్ లో వేగంగా వ్యాప్తి చెందింది. కరోనా రూపంలో ఊహించని ఉపద్రవం వచ్చింది. కరోనా విజృంభణ వల్ల కేంద్రం లాక్ డౌన్ ను ప్రకటించింది. అనంతరం కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటి విడత లాక్ డౌన్ తో కరోనా అదుపులోకి వస్తుందని చాలామంది భావించారు. కానీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ వచ్చింది. 
 
రెండో విడత వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసిన కేంద్రం మూడో విడత నుంచి సడలింపులు ఇస్తూ వచ్చింది. తాజాగా నాలుగో విడతలో కేంద్రం భారీగా సడలింపులు ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ గతంలో కరోనాతో కలిసి జీవించక తప్పదని వ్యాఖ్యలు చేశారు. మొదట్లో జగన్ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినా తర్వాత ఇతర రాజకీయ నాయకులు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 
 
తాజాగా కలెక్టర్ల సమావేశంలో జగన్ మాట్లాడుతూ రాబోయే కాలంలో కరోనా రాని మనిషి ఉండరేమో...? అని వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా సోకిన వ్యక్తులపై, వారి కుటుంబాలపై ఇతరులు వివక్ష చూపుతున్నారు. సీఎం జగన్ తన వ్యాఖ్యల ద్వారా ఎవరు ఎప్పుడు కరోనా భారీన పడతారో చెప్పలేమని... ఇతరులపై వివక్ష చూపవద్దని సందేశం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: