జగన్..రాజకీయాల్లోనే కాదు, పాలనలో కూడా రాటుతేలుతున్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తనదైన ఆలోచనలతో పాలనారధాన్ని పరుగులెత్తిస్తున్నారు. విప్ల‌వాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ విధంగా పాలనలో దూకుడు పెంచుతున్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా జగన్ తన రూట్ తనదేనని చెప్పేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా జగన్ కి కొన్ని టార్గెట్లు ఉన్నాయి. వాటికి ఎప్పటికపుడు బ్రేకులు పడుతున్నాయి. అయితే  ఈసారి మాత్రం వాటిని పూర్తి చేయాల్సిందేనని జగన్ గట్టి పట్టుదల మీద ఉన్నారట. అవసరం అయితే  డిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసైనా అనుకున్నది సాధించాలని జగన్ భావిస్తున్నారుట. ఇంతకీ అవేంటి అంటే మూడు రాజధానుల వ్యవహారం, దానితో ముడిపడి ఉన్న శాసన మండలి రద్దు వ్యవహారం.

 

జగన్ శాసనమండలి వద్దు అంటూ డిసెంబర్లో  ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి మరీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇప్పటికి ఆరు నెలలు అయినా కూడా అతీ గతీలేదు. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చిలో సరిగా సాగలేదు. ఓ వైపు జాతీయ పౌర చట్టం మీద పార్లమెంట్ లో  రచ్చ సాగడంతో తరచూ వాయిదా పడుతూ వచ్చాయి. ఇక కరోనా వైరస్ దేశానికి ముప్పుగా మారడంతో ఏకంగా పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేశారు.

 

ఇపుడు జూన్ నెలలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారని అంటున్నారు. ఈ సమావేశాల్లోనే తేల్చుకోవాలని జగన్ భావిస్తున్నారుట. అవసరం అయితే తానే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలసి మరీ రద్దు బిల్లు ఒకే చేయించుకోవాలనుకుంటున్నారుట. అదే విధంగా మూడు రాజధానుల వ్యవహారాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారుట. 

 

శాసన మండలి లేకపోతే అసెంబ్లీలోనే ఆమోదించి దాని ప్రకారం విశాఖను పాలనారాజధానిగా చేసుకుంటారని అంటున్నారు. మొత్తానికి జూన్ నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఏపీలో నిర్వహిస్తున్నారు. దాని కంటే ముందు జగన్ ఢిల్లీ టూర్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి జగన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: