మే 30వ తేదీన సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం పూర్తవుతుందన్న సంగతి తెలిసిందే.  అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం, లాక్ డౌన్, విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనల ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునే అవకాశం లేదు. పైగా హంగులు, ఆర్భాటాలు అంటే జగన్‌కు కూడా నచ్చవు. అయితే ఇక్కడ మే 30 ఇంకా రాలేదు. వైసీపీ నేతలు ఎక్కడా సంబరాలు చేసుకున్న దాఖలాలు లేవు.

 

కానీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాత్రం వైసీపీ ఏడాది పాలనపై సంబరాలు, వారోత్సవాలు జరుపుకోవడం హాస్యాస్పదమని మాట్లాడారు. ఏడాదిలో ఏం ఘనకార్యాలు సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని? పేదల సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకా సంబరాలు? అని నిలదీశారు. ఇక ఏడాదిలో ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతున్నారు.

 

అయితే టీడీపీ ఘోరంగా ఓడి, రాజకీయాల్లో చంద్రబాబు కంటే చాలా జూనియర్ అయిన జగన్ సీఎంగా ప్రమాణం చేసి సంవత్సరం కావొస్తుండటంతో యనమలకు గత ఏడాది ఘోర ప్రభావం గుర్తుస్తోన్నట్లుంది. అందుకే తట్టుకోలేక ఇంకా వైసీపీ శ్రేణులు సంబరాలే మొదలుపెట్టలేదు కానీ, అప్పుడే సంబరాలు జరుపుకోవడం సరికాదన్నట్లు మాట్లాడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అయినదానికి, కానిదానికి సంబరాలు, హడావిడి చేసిందే టీడీపీ నేతలే. వాటి కోసం చాలానే దుబారా ఖర్చులు కూడా చేశారు.

 

కానీ జగన్ సీఎం అయ్యాక, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించారు. పేదల సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకా సంబరాలు? అని యనమల ఓ ఊహించని డైలాగ్ వేశారు కదా...ఆయన వేసిన ప్రశ్నకు సమాధానం ప్రజలైతే బాగా చెప్పేస్తారేమో. అసలు తొలిసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం లోపే అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్ ఒక్కరే. కానీ యనమలకు అదేమీ కనిపడలేదు అనుకుంటా...అందుకే గుడ్డిగా విమర్శలు చేసేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: