జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ ఎప్పుడు ఏదొకరకంగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన చేస్తుందని చెప్పి, టీడీపీ నేతలు పలు సందర్భాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల లాక్ డౌన్ సమయంలో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని, పేదలకు రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేశారు. అయితే ఈ దీక్షలని వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. అటు ప్రజలు కూడా ఈ దీక్షలని పట్టించుకున్న దాఖలాలు లేవు.

 

అయితే ఎవరు పట్టించుకోకపోయినా చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా విద్యుత్ బిల్లులు అధికంగా రావడంపై నిరసన దీక్షలు చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు వచ్చిన 3 నెలల కరెంట్ బిల్లులని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, టీడీపీ నేతలు తమ తమ నియోజకవర్గంల్లో దీక్షలు చేశారు.

 

ఈ క్రమంలోనే మద్యం రెట్లు పెంచితే తాగరని అన్నారు,  ఇప్పుడు విద్యుత్ రేట్లను సైతం పెంచారు.. దీనికేంటి అర్ధం? అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తమ హయాంలో ఒక్క పైసా కూడా కరెంట్ బిల్లు పెంచలేదని, అలాగే మిగులు కరెంట్ సాధించిన ఘనత తమదని, కానీ జగన్ మాత్రం ప్రజలపై ఇష్టానుసారంగా కరెంట్ బిల్లుల భారం మోపారని ఫైర్ అయిపోతున్నారు. పేదల విద్యుత్ చార్జీలు మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇక టీడీపీ దీక్షలకు వైసీపీ ప్రభుత్వం తలోగ్గే పరిస్తితి లేదు. కానీ టీడీపీ డిమాండ్‌లో అర్ధం ఉందని కొన్ని వర్గాల ప్రజలు అంటున్నారు. కొందరికి చాలా ఎక్కువగానే కరెంట్ బిల్లులు వచ్చాయని, కాబట్టి ఒక ప్రాతిపదికన పేదల కరెంట్ బిల్లులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ఎంత కరెంట్ వాడితే అంతే బిల్లులు వచ్చాయని, అసలు తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి చూసుకుంటే 3 నెలల కరెంట్ బిల్లులని రద్దు చేయాలనే టీడీపీ డిమాండ్‌ని జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం కష్టమనే విషయం అర్ధమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: