సీఎం జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. ఎన్నికల ముందు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ప్రజల్లో పార్టీకి మంచి గుర్తింపు తెస్తున్నారు. పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
కానీ సీఎం జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయంపై మాత్రం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం జగన్ ప్రజలకు మేలు చేయాలనే ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ సీఎం తీసుకున్న ఆ నిర్ణయం ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. జగన్ హయాంలో ఇసుక పాలసీ ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతోంది. ఇసుకకు సంబంధించి భారీ దోపిడీ జరిగిందని... ఉచితం పేరుతో టీడీపీ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని వైసీపీ గతంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 
 
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ చివరకు దళారులు ఆన్ లైన్ ద్వారా అక్రమాలు చేస్తున్నారు. ఇసుక ఆన్ లైన్ లో పెట్టిన వెంటనే కొంతమంది దళారులు ఇసుకను బుక్ చేసుకుంటూ సామాన్యులకు ఇసుక దక్కకుండా చేస్తున్నారు. నిజంగా ఇసుక అవసరమైన వారికి ఇసుక అందని పరిస్థితి నెలకొంది. 
 
కొంతమంది బాధితులు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. నిజంగా అవసరమైన ఇసుక అందేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఇసుక పాలనీని మార్చకపోతే వ్యతిరేకత రోజురోజుకు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రజలు  ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: