విభీషణుడు గొప్ప క్యారక్టర్. ఆ పాత్ర ఉండడం వల్లనే రామాయణం కధ  అంత బాగా రక్తి కట్టింది. అంతవరకూ అన్న పక్కన ఉండి కీలకమైన యుధ్ధ సమయంలో అటునుంచి ఇటు జంప్ చేయడం వల్ల రావణుడి మరణం సంభవించింది. రాముడు విజేత కాగలిగాడు, ఇంటి గుట్టు లంకకు చేటు అన్న సామెత కూడా నాడే పుట్టుకువచ్చింది. 

 

సరే ఇవన్నీ ఎలా ఉన్నా విభీషణుడి పాత్ర మాత్రం అప్పటికీ ఇప్పటికీ చాలా ఇంపార్టంటే. రాజకీయాల్లో వారు ఉండి తీరాల్సిందే. లేకపోతే క్లైమాక్స్ లో ట్విస్టులు ఉండవు. పాలిటిక్స్ కి కూడా కిక్కు అంతకంటే ఉండదు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే విభీషణులు ఎంతమంది ఉన్నారు అన్న చర్చలేటెస్ట్ గా  సాగుతోంది. రాజకీయ గండరగండడు చంద్రబాబుకు కూడా తన  పార్టీలో విభీషణులెవరో అంతుపట్టడంలేదుట‌.

 

అవును  మరి,  అచూకీ దొరికితే విభీషణుడు ఎలా అవుతాడు. అదను చూసి దెబ్బ కొట్టి గోడ దూకేవారే కదా ఆ పాత్రకు అర్హులు. ఈ సంగతి బాబుకు కూడా తెలుసు. ఇదిలా ఉండగా  కరోనా మహమ్మారి గురించి ఇపుడు ఎవరూ ఆలోచించడంలేదు. ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటున్నారు. దాంతో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ వైసీపీ చేపట్టింది అని అంటున్నారు.

 

పచ్చ పార్టీలో చిచ్చు పెట్టి అయినా చంద్రబాబు అపోజిషన్ కుర్చీని కదిపేయాలని వైసీపీ నిర్ణయించుకుందని టాక్. ఆ విధంగా చూసుకుంటే వైసీపీ వలకు చిక్కిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది అన్న ప్రశ్న కూడా ఇపుడు  వస్తోంది. జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తరాంధ్రా నుంచి ఇద్దరు వైసీపీలోకి వెళ్లడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో టీడీపీ గెలిచింది అచ్చంగా ఆరు సీట్లు మాత్రమే. 

 

అందులో విశాఖలోనే నాలుగు సీట్లు ఉన్నాయి. మరి ఇందులో ఏ ఇద్దరు వైసీపీ గూటికి చేరుతారన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. ఇక్కడ ఒక మాజీ మంత్రి మీద అందరి చూపూ పడుతోంది. అలాగే ఒక ఎమ్మెల్యే కదలికలూ అనుమానంగా ఉన్నాయట. అదే జరిగితే ఉత్తరాంధ్రాలో టీడీపీ నడ్డి విరిగినట్లేనని అంటున్నారు. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: