ఎలుకల కోసం పిల్లి కాపు కాసినట్టుగా దొంగ రాజకీయాలు చేస్తు దొరబాబుల్లా చలామణి అవుతున్న రాజకీయ నాయకులు ఎన్నాళ్ళకో గాని దొరకరు.. ఇలాంటి వారి యవ్వారం ఎలా ఉంటుందంటే సచ్చినోని పీనుగు ఎల్లెల్కలైతేంది బోర్లబొక్కలైతేంది.. నాకెలాగో సిగ్గు శరం లేదు.. నా అనుచరులు నాకోసం చేసిన తప్పు నాది కాదని తప్పించుకుంటాను, వేరేవాడు మంచి చేస్తే నా ఖాతాలో వేసుకుని ఓట్లు రాబడతాను.. ఎటుతిరిగి నేను లాభపడటం కావాలి అని పిల్లికి బిచ్చం పెట్టని కొందరు రాజకీయ నాయకుల ఆలోచనలట.. అంతే కాకుండా ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదని కూడా ఆలోచించే ఘనులు ఉన్నారు మన రాజకీయాల్లో..

 

 

అసలు విషయం తేలకుండా ఇదంతా ఏంటని ప్రశ్నిస్తున్నారా.. అక్కడికే వస్తున్న.. ఎన్నికలు వచ్చినప్పుడు మన నాయకులు ఏమంటారు.. మీకూ కష్టం వచ్చినప్పుడు నా ఇంటి డోరు తట్టండి.. కుక్కలా తోక ఊపుకుంటూ మీకు సేవ చేస్తాం అని మాటయిస్తారు.. ఓట్లుపడి గెలిచాక.. అయ్యా అని వెళ్ళితే ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నాం అంటూ సమయాన్ని ఐస్‌క్రీంలా చప్పరిస్తారు కానీ చేతికి చిక్కరు.. ఇక ఈ కరోనా సమయంలో చాల మంది రాజకీయ నాయకుల నిజ స్వరూపాలు భయట పడ్డాయట.. ఈ వైరస్ భయంతో ప్రజలందరు ఇళ్లకే పరిమితం అయ్యి తినడానికి తిండి లేక, చేతిలో డబ్బులు లేక అవస్దలు పడుతుంటే, ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు దాదాపుగా ఎవరు పట్టించుకోలేదట..

 

 

ఇక ముఖ్యమైన నాయకులైతే ఉన్నారో లేరో కూడా తెలియకుండా.. మీ చావు మీరు చావండి మళ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కుక్కలకు బిస్కట్స్ వేసినట్టు మీ ముఖాన డబ్బులు పడవేస్తే మీరే గెలిపిస్తారని నిమ్మకు నీరెత్తినట్లుగా హాయిగా ఏసీలో ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారట.. ఇక దొరికిందే తడవుగా అందిన కాడికి దోచుకున్న వారు కొందరైతే.. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా. వలసకూలీలు పడుతున్న బాధలు చూడలేక జనం చందాలేసుకొని కూలీలను ఆదుకోవడానికి చేసిన మంచి పనులన్నింటినీ తన ఖాతాలో వేసుకోవడానికి కూడా ఒక మంత్రి గారు సిగ్గుపడలేదు అంటే అర్ధం చేసుకోండి మన దేశంలోని రాజకీయాలు..

 

 

మొత్తానికి ప్రజలకు గనుక ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఈ కరోనా సమయంలో చారాణా పంచి, బారాణ జేబులో వేసుకున్న నీచరాజకీయ నాయకులకు మాత్రం తగిన బుద్ధి చెప్పాలని వీరి విధానం నచ్చని వారు అనుకుంటున్నారట..  అసలు తల్లిపాలను అంగట్లో అమ్మేలా తయారవుతున్న ఈ రాజకీయాలనుండి ప్రజలను ఏ దేవుడు రక్షిస్తాడో అని ఆశపడుతున్న వారు కూడా లేకపోలేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: