ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా  వైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. ఈ మహమ్మారికి మందు లేదు...  నివారణ ఒక్కటే మార్గం అన్నది ఈ రోజు రోజుకి రుజువు  అవుతూనే ఉంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం అక్కడ తగ్గుముఖం పట్టినా ప్రపంచ దేశాలను మాత్రం పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి వైరస్ ప్రభావం భారత్లో కూడా ఎక్కువగానే ఉన్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో అయితే ఏకంగా పరిస్థితి చేయి దాటిపోయే  స్థితికి చేరుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భారీగా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికి భారతదేశంలో లక్షల కేసులు దాటిపోయాయి. 

 

 అయితే ప్రపంచంలోని మహా మహా శాస్త్రవేత్తలను ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. దీంతో ప్రతి మనిషి తమ ప్రాణాలు కాపాడుకోవడం తమ చేతిలో పని గా మారిపోయింది. ఎప్పటికప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవడం.. మాస్క్ ధరించడం... సామాజిక దూరం పాటించడం లాంటివి చేస్తూ తమ ప్రాణాలను యమధర్మరాజు చేతిలో పెట్టకుండా కాపాడుకుంటున్నారు చాలా మంది . ఇప్పటివరకు ఎలా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో  మాత్రం మరింత క్లిష్టంగా  పరిస్థితులు మారానున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులో   భాగంగా పలు రాష్ట్రాలలో రోడ్డు రవాణా కూడా ప్రారంభమైంది. అదే సమయంలో డొమెస్టిక్ విమానాలు కూడా ఈ నెల 25 నుంచి ఆకాశంలోకి ఎగిరనున్నాయి .. జూన్ ఒకటవ తేదీనుంచి రైలు రవాణా కూడా ప్రారంభం కానుంది. 

 

 దీంతో మనుషుల ప్రయాణం మొదలు కానుంది. మనిషి ఈ మహమ్మారి వైరస్ గారికి వాహకం   కాబట్టి... మహమ్మారి వైరస్ మరింత  ప్రబలే అవకాశం ఉంది. దీంతో దేశంలో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఊహకందని విధంగా ఉంది. దీంతో మనిషి ప్రాణాలు తమ చేతిలోకి వచ్చేసాయి... రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వాడే బతికే ఛాన్స్ లు ఎక్కువగా ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ హెర్డ్ ఇమ్యూనిటీ  పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటే బతుకుతారు లేకపోతే చేస్తారు అనే విధంగా పరిస్థితులు వస్తాయేమో అన్న  అంచనాలు కూడా వస్తున్నాయి . ఏదేమైనా ప్రస్తుతం రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: