విశాఖలో జరిగిన ఎల్జీ  పోలిమెర్స్  గ్యాస్ లీకేజీ ఘటన  ఎంత వినాశనం సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశాఖ  ఘటనలో ఎంత దారుణ పటిస్థితులు చోటుచేసుకున్నాయో దేశం మొత్తం చూసింది. నిజంగా ఈ ఘటనలో  దాదాపు పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు.. ఇక మూగజీవాలు ఎన్నో చనిపోయాయి.. ఆయా గ్రామాల మొత్తం అతలాకుతలం అయిపోయాయి. అయితే విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో  రాష్ట్ర  ప్రభుత్వం సత్వర చర్యలు. ముఖ్యంగా బాధితులకు నష్టపరిహారం అందించడం విషయంలో అయితే ప్రభుత్వం స్పందించిన తీరు ప్రశంసలు కూడా కురుసాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. 

 


 అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు కోరిక తీర్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏంటి చంద్రబాబు కోరిక తీర్చడం ఏమిటి అని  షాక్ అవుతున్నప్పటికీ ఇది మాత్రం నిజమే. ఎందుకంటే విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగిన నాటి నుంచి ఈ కేసును కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని లేదా.. సిబిఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దర్యాప్తు గురించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన కేసు విచారణను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. 

 


 ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ.. విశాఖ దుర్ఘటనను కారణంగా చూపుతూ ఏకంగా ఎల్జి పాలీమర్స్   అనే కంపెనీని మూసివేయటం  సరైనది కాదు అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్లను పెంచుకోవటానికి విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం దక్షిణ కొరియాకు చెందిన విదేశీ సంస్థను  పూర్తిగా మూసివేస్తే.. రాబోయే కాలంలో వచ్చే విదేశీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి వెనకడుగు వేస్థాయి  అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: