నేపాల్ ప్రధాని కేపీ ఓలీ భారత్ పై గత రెండు రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. ఇటలీ, చైనా దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని అన్నారు. నేపాల్ దేశంలో కరోనా వ్యాప్తికి భారత్ కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని కాలాపానీ, లిపులేఖ్, లింపుయాధురాలు నేపాల్ కు చెందినవేనని చెప్పారు. భారత్ నుంచి ఈ ప్రాంతాలను దౌత్యపరమైన మార్గాల ద్వారా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. 
 
కొన్ని రోజుల క్రితం భారత్ కు చెందిన మూడు ప్రాంతాలను నేపాల్ తమ దేశ అంతర్గత భూభాగాలుగా చూపడం... ఆ దేశ మంత్రిమండలి ఆ మ్యాప్ ను ఆమోదించటం తెలిసిందే. భారత్ నుంచి అక్రమంగా నేపాల్ కు వస్తున్న వారి వల్లే వైరస్ వ్యాపిస్తోందని... అధికారులు సరైన పరీక్షలు చేయకుండానే వారిని అనుమతిస్తున్నారని నేపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అయితే నేపాల్ ప్రధాని భారత్ పై చేసిన వ్యాఖ్యల వెనుక చైనా ఉందని తెలుస్తోంది. 
 
నేపాల్ ను అడ్డం పెట్టుకుని చైనా రాజకీయాలు చేస్తోందని తెలుస్తోంది. చైనా నేపాల్ ను గుప్పిట్లో పెట్టుకుని ఇండియాపై ఉసిగొల్పుతోందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే నేపాల్ మ్యాప్ లో మార్పులు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేపాల్ పాలకులు చైనా చేతిలో కీలుబొమ్మలుగా మారడం వల్లే చైనా ఎవరెస్ట్ ను తన ఖాతాలో వెసుకున్నా నోరు మెదపడం లేదని చెబుతున్నారు. 
 
నేపాల్ చైనాపై ఆధారపడటంతో డ్రాగన్ దేశం ఎత్తుగడలు వేసి భారత్ పై విమర్శలు చేయిస్తోంది. భారత్ ను ఏదో ఒక విధంగా ప్రపంచ దేశాల ముందు నెగిటివ్ చేయాలని... భారత్ ను రెచ్చగొట్టాలని భావిస్తోంది. ప్రత్యక్షంగా ఎదుర్కోలేక చైనా నేపాల్ ను అడ్డు పెట్టుకుని భారత్ పై విమర్శలు చేయిస్తోంది. భారత్ నేపాల్ విమర్శలను తిప్పి కొట్టే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: