తెలుగు రాజకీయాలలో చాణిక్యుడు అని పేరు తెచ్చుకున్న చంద్రబాబు వ్యూహాలు ఇప్పుడు తేలిపోతున్నాయి. ఒకానొక సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల పండిపోయిన రాజకీయ నాయకులను తన వ్యూహాలతో చంద్రబాబు ముప్పు తిప్పలు పెట్టేవారు. ఎన్నికల సమయంలో ప్రజల నాడీ ఏంటో తెలుసుకుని ఆ విధంగా హామీలు ఇచ్చి పొత్తులు పెట్టుకుని అధికారంలోకి రావడంలో చంద్రబాబును మించినవారు మరొకరు ఉండరని చాలామంది తెలుగు రాజకీయాలలో సీనియర్ నాయకులు అంటుంటారు. అందువల్లే విభజన జరిగిన తరువాత 2014 ఎన్నికల సమయంలో దాదాపు జగన్ ముఖ్యమంత్రి అయిపోతారు అని అనుకున్న టైమ్ లో చంద్రబాబు… పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపి ఆఖరి లో రిజల్ట్ మొత్తం తారుమారయ్యేలా రాజకీయ చాణక్యంగా  వ్యవహరించడంతో టిడిపి అధికారంలోకి వచ్చిందని అప్పటి ఎన్నికల గురించి చాలా మంది సీనియర్ నాయకులు చెబుతుంటారు.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం చంద్రబాబు ఆలోచన నుండి వస్తున్న ఆయుధాలు, బాణాలు, విల్లులు బోసిపోతున్నయట. ఇందువల్లే సోషల్ మీడియాలో ఏవో వీడియోలు చేసి పాపులారిటీ సంపాదించుకున్న వారిని నమ్ముకునే పరిస్థితికి చంద్రబాబు దిగజారిపోయారు అని చాలామంది అంటున్నారు. సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఆర్టిస్టులను నమ్ముకుని అధికార పార్టీ పై ప్రస్తుతం ఎక్కువగా విమర్శలు చేయిస్తున్నారన టాక్ బలంగా వినబడుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొంతమందిని నియమించి చంద్రబాబు అధికార పార్టీపై విమర్శలు చేయించేవారు.

 

కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఈ విధంగా సోషల్ మీడియాలో వ్యక్తులను నమ్ముకుని రాజకీయం చేయడం పట్ల చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న జగన్ కూడా ఎక్కువ ఛాన్స్ ప్రతిపక్షానికి ఇవ్వడం లేదన్న టాక్ బలంగా వినబడుతుంది. దీని వల్లే చంద్రబాబు అధికార పార్టీ పై ప్రయోగిస్తున్న ఆయుధాలు - బాణాలు - విల్లులు లాంటి ఆరోపణలు టిడిపినే ఇరుకున పెట్టే పరిస్థితికి బాబు వ్యూహాలు దిగజారి పోతున్నట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు బలంగా వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: