దేశంలో కరోనా వైరస్ ఉన్న కొద్ది వ్యాప్తి చెందుతూనే ఉంది. లాక్ డౌన్ ఎంత పటిష్టంగా అమలు చేస్తున్న గాని వైరస్ అదుపులోకి వచ్చిన దాఖలాలు మాత్రం కనబడటం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగిస్తూనే ఉంది. ప్రస్తుతం దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు దాటిపోయాయి. ఆ రోజుల్లో వర్షాకాలానికి వచ్చేసరికి రెండు లక్షల కేసులు ఇండియాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి సమయంలో లాక్ డౌన్ టైం లో ఇంట్లోనే ఉంటున్న వారు సెల్ ఫోన్ ద్వారా సమయాన్ని ఎక్కువగా గడుపుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు దీన్ని అదునుగా చేసుకొని మొబైల్స్ కి లేనిపోని మెసేజ్ లు పెడుతూ అకౌంట్ లో ఉన్న డబ్బులను కాజేస్తున్నారు.

 

ముఖ్యంగా ట్రోజన్ సహాయంతో క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల డేటాను చోరీ చేసి ఖాతాలో ఉన్న డబ్బులు మాయం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇటువంటి కేసులు భయంకరంగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సమాచారం తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చెయ్యాలని సందేశాలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఆ మెసేజ్ ను పొరపాటున క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం మాయమవుతున్నాయి.

 

కాబట్టి ఇంటిలో లాక్ డౌన్ టైం లో సెల్ ఫోన్ లకి కరోనా వైరస్ పేరిట వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ పేరిట ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం యాప్ ఇన్ స్టాల్ చేయాలని ఎలాంటి మెసేజ్ లు వచ్చినా అనుమతించొద్దని బ్యాంకులో ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దు అని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పొరపాటున ఇప్పటికే అలాంటి యాప్స్ ఇన్ స్టాల్ చేసి ఉంటే డిలీట్ చేసి వెంటనే ఫోన్ రీసెట్ చేయాలని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: