కరోనా వైరస్ విపత్తు సమయంలో ప్రజలను ముందుండి కాపాడినది వైద్యులు మరియు పోలీసులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మహమ్మారి వైరస్ నుండి ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఫ్రంట్ లైన్ లో ఉంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డ్యూటీ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అలాంటి వారికి కొన్ని చోట్ల ప్రభుత్వాలు కనీసం వారి చేస్తున్న త్యాగాలను గుర్తించడం లేదు. అంతేకాకుండా కనీస వసతులు కల్పించకుండా డ్యూటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విధంగానే ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ భయంతో 500 మంది కానిస్టేబుల్స్ ఏకంగా డిసిపి పై దాడికి ప్రయత్నించడంతో ఆ  వార్త పశ్చిమబెంగాల్ మీడియాలో సంచలనంగా మారింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే వారికి అవసరమైన మాస్క్ లు అదేవిధంగా శానిటైజర్స్‌ కూడా ఇవ్వలేదట.

 

దీంతో పెద్దఎత్తున కానిస్టేబుల్స్ ఆయన పై దాడికి ప్రయత్నించడంతో వెంటనే డిసిపి అక్కడినుంచి పారి పోవడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల అంఫాన్ తుఫాను సహాయ కార్యక్రమాల కోసం 500 మందికి డీసీపీ డ్యూటీ వేశాడు. అయితే అందులో ఒక ఎస్సైకి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ భయభ్రాంతులకు గురయ్యారు. అదే సమయంలో ఉన్న పెద్ద అధికారులు క్యాంపును శానిటైజేషన్‌ చేయించడంలో అలసత్వం చూపడంతో కానిస్టేబుల్స్ అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఈ విషయం గురించి డీసీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

 

ఆయన కూడా సరిగ్గా పట్టించుకోనట్లు వ్యవహరించడంతో వెంటనే ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కోపం తెచ్చుకుని నడిరోడ్డుపై డీసీపీని పరిగెత్తించే విధంగా దాడికి పాల్పడటం జరిగింది. దీంతో వాటికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో రావటంతో ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఫోటోలు వీడియోలు చూసిన చాలా మంది నెటిజన్లు విషయం మొత్తం తెలుసుకుని తప్పు లేదు ఆ కానిస్టేబుల్స్ వాళ్ళ పై దాడి చేయటంలో అని అంటున్నారు. వాళ్ళ  కోపం లో అర్ధం ఉంది అని సమర్ధిస్తున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి కదా అని సమర్థిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: