తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమం ‘మహానాడు’. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు త్వరలో జరగబోయే 'మహానాడు' ను వేదికగా చేసుకుని టిడిపి పార్టీ నీ బలోపేతం చేయటం కోసం ప్లాన్ చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు టిడిపి క్యాడర్ కుదేలు కావటంతో వారిలో ఉత్సాహం నింపడానికి పార్టీ తరఫున పదవులు కొత్తవారికి అప్పజెప్పడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ రాణిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అధికార పార్టీకి కళ్లెం వేయడానికి సరికొత్త ఎత్తుగడలు వెయ్య భోతున్నారట.

 

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. అయితే చంద్రబాబు ‘మహానాడు’ కార్యక్రమం తర్వాత ప్రజల లోనే ఉండబోతున్నట్లు టిడిపి పార్టీలో టాక్. చాలావరకు ఇకనుండి పార్టీ లో కష్టపడి పనిచేసి పార్టీకి అండగా ఉన్న క్యాడర్ లో యువ నాయకులకు పార్టీ పగ్గాలు అప్పజేప్ప భోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

దీంతో అధికారంలో ఉన్న వైసీపీ అటాకింగ్ మోడ్ లోకి వెళ్లడమే ప్లాన్ గా రంగం లోకి దిగుతూ 'మహానాడు' రోజే ఉత్తరాంద్ర మరియు కోస్తా జిల్లాకు చెందిన టీడీపీ కీలకమైన నాయకులను వైసీపీ లో జాయిన్ చేసుకొని ఆ రోజే చంద్రబాబు కి బిగ్ బ్రేకింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సదరు టిడిపి నాయకులతో వైసీపీ పార్టీ పెద్దలు మాట్లాడుతున్నట్లు సమాచారం. వాళ్లు కూడా పార్టీలోకి రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు టాక్. మిగిలి ఉన్న ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబుకి లేకుండా చేయాలని అనుకుంటున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. మొత్తం మీద 'మహానాడు' వేదికగా చంద్రబాబుకి బిగ్ షాక్ వైసిపి పార్టీ రెడీ చేస్తున్నట్లు అర్థమవుతుంది. మరి ఇన్ని ఆటుపోట్లను చంద్రబాబు ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: