వైయస్ జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్లీ వెనక్కి తిరిగి చూడరు అని అందరికీ తెలుసు. ప్రజలకు ఇచ్చిన హామీ విషయంలో గాని, నేతలకు ఇచ్చే మాట విషయంలో గాని, జగన్ మాటమీద నిలబడే మనిషి అని అందరికీ తెలుసు. అటువంటి సమయంలో మొన్నటి వరకు కరోనా వైరస్ విషయం లో బిజీగా గడిపిన జగన్ పూర్తి దృష్టి పాలనపై పెట్టడానికి రెడీ అవుతున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపులు వైపు మొగ్గు చూపుతుంటే జగన్ మాత్రం సడలింపులు, ఆంక్షలు ఎత్తివేస్తూ ఎప్పటిలాగానే అభివృద్ధి సంక్షేమం మరియు పాలన గాడిలో పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తులో కరోనా వైరస్ బలంగా వ్యాపించిన గాని ఏపీలో సాధారణ కార్యక్రమాలు వ్యవహారాలకి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని జగన్ అనుకుంటున్నారట.

 

ఇదిలా ఉండగా మార్చి నెలలో జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఓటాన్ అకౌంట్ ను గవర్నర్ ద్వారా ఆమోదించుకున్నారు. అది కూడా మూడు నెలలకు మాత్రమే. దాంతో ఆ గడువు జూన్ 30తో ముగుస్తుంది. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్ లో  సమావేశాలు ప్రారంభించాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తోంది. అయితే ఈ సమయంలో శాసన మండలి విషయంలో  జగన్ మనసు ఏ విధంగా ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. గత డిసెంబర్ నెలలో శాసనమండలిని రద్దు చేయాలని కోరుతూ ప్రత్యేక సమావేశం నిర్వహించి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ఇటీవల మార్చిలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ రావడంతో ఏపీ శాసన మండలి రద్దు బిల్లు అటూ ఇటూ కాకుండా అయిపోయింది.

 

ఈ సమయములో మండలిలో మరో ఆరునెలల మాత్రమే టీడీపీకి గడువు ఉండటంతో శాసన మండలి రద్దు విషయంలో జగన్ మనసు మార్చాలని వైసీపీ సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆరు నెలల కాల వ్యవధిలో టిడిపి నాయకులు మొత్తమంతా శాసన మండలి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు మెజారిటీ వైసీపీదే అవుతుంది. అందువల్ల ఇంత వరకూ ఎదురు చూశాం కాబట్టి ఆరు నెలలు ఆగితే మండలి పూర్తిగా మన చేతిలో ఉంటుంది అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ తర్వాత పార్టీ పరంగా కూడా నాయకులకు అవకాశాలు పెరుగుతాయని ఈ విషయంలో జగన్ మనసు మారితే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే ఇదే విషయంలో జగన్ ముందుగా అన్నట్టు మండలి రద్దుకే మొగ్గు చూపితే మనసు మార్చుకోకపోతే శాసన మండలి అనేది ఇక ఏపీలో కనబడనట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: