ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు.. ఓ వ్యవస్థ.. అందులో ఎవరు తప్పు చేసినా.. ఆ వ్యవస్థ అధిపతికే ఆ కళంకం అంటుంది. వ్యవస్థ అద్భుతాలు చేసినా ఆ క్రెడిట్ అధిపతికే వస్తుంది. మన ప్రజాస్వామ్యంలో సీఎం పాత్ర కూడా అలాంటిదే.. ప్రభుత్వంలో ఎవరు ఏం చేసినా జనం మాత్రం ముఖ్యమంత్రినే కోట్ చేసి మాట్లాడతారు. అందుకే కొన్నిసార్లు అధికారులు చేసే తప్పులకు కూడా ముఖ్యమంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 

 

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా ఏపీలో రంగనాయకమ్మ అనే 65 ఏళ్ల మహిళ తన ఫేస్ బుక్ లో ప్రభుత్వాన్ని విమర్శించిందని.. సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెకు విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. విచారణకు పిలిపించారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటంటే.. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోని అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఓ పోస్టు ఫేస్ బుక్ లో పెట్టారు.

 

 

దీంతో సీఐడీ ఆమెపై కేసు పెట్టింది. ఆమె సీఐడీ ఎదుట హాజరుకావాల్సి వచ్చింది. సీఐడీ ఆమె పాత పోస్టుల గురించి కూడా అడిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే అసలు సమస్య ఇక్కడ ఆమె పెట్టిన పోస్టు గురించి కాదు.. కానీ 65 ఏళ్ల వృద్ధురాలు పెట్టిన పోస్టును సీరియస్ గా తీసుకుని సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరిపితే.. తెలుగుదేశం అనుకూల ఛానళ్లు ఊరుకుంటాయా.. ఈ ఇష్యూను అందిపుచ్చుకున్నాయి.

 

 

రోజంతా ఈ రంగనాయకమ్మ గురించి ఆమెకు జరిగిన అన్యాయం అంటూ కథనాలు కుమ్మేశాయి. విపక్షాల నేతలు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఆమెను పరామర్శించారు. ఈ విషయం జగన్ సర్కారుకు చెడ్డపేరు తెచ్చేదే కానీ.. ఏమాత్రం ఉపయోగపడదు. గతంలో టీడీపీ సర్కారులో ఇలా జరిగినప్పుడు ప్రజాస్వామ్యవాదులంతా వైసీపీ సానుభూతి పరులవైపు నిలిచారు. ఇప్పుడు జగన్ సర్కారు కూడా ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే.. తేడా ఏముంటుంది..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: